సినిమా థియేటర్‌కు వెళ్లేది ప్రశాంతంగా సినిమా ఎంజాయ్ చేయడానికే కదా? కానీ ఒక యువతి మాత్రం రాత్రి 11 గంటల షోలో, పక్కన వందల మంది సినిమా చూస్తుంటే ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఆఫీస్ పనిలో మునిగిపోయింది!
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అందరూ సినిమా చూస్తూ ఈలలు వేస్తుంటే, ఒక యువతి మాత్రం తన ఆఫీస్ పనిని పూర్తి చేస్తూ కనిపించింది. ఈ వింత దృశ్యం ఇప్పుడు ‘వర్క్ ఫ్రమ్ థియేటర్’ పేరుతో వైరల్ అవుతోంది. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటే మీరు కూడా షాక్ అవుతారు!

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, రాత్రి 11 గంటల షోకు వచ్చిన ఒక యువతి చీకటిలో వెలుగుతున్న ల్యాప్‌టాప్ స్క్రీన్‌తో ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంది. చుట్టూ ఉన్న ప్రేక్షకులు సినిమాపై దృష్టి పెడితే, ఆమె మాత్రం ఏకాగ్రతతో తన కీబోర్డ్ టైప్ చేస్తూ పని పూర్తి చేస్తోంది. కార్పొరేట్ ఉద్యోగులు ఈ వీడియో చూసి “మా కష్టాలు ఇలాగే ఉంటాయి” అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలు కామన్ అయిపోయాయని, మరికొందరు మాత్రం “పని అంత ముఖ్యమైతే సినిమాకు రావడం ఎందుకు? మూమెంట్ ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నారు” అంటూ విమర్శిస్తున్నారు. థియేటర్ లోపల సిగ్నల్ ఎలా వస్తుందనేది కొందరి సందేహం కాగా, మరికొందరు ఆమె డెడికేషన్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. రణ్‌వీర్ సింగ్ క్రేజ్ కారణంగా సినిమా మిస్ అవ్వకూడదని, అటు ఆఫీస్ టాస్క్ కూడా పెండింగ్ ఉండకూడదని ఆమె ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ ‘వర్క్ ఫ్రమ్ థియేటర్’ సంస్కృతి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పని ఒత్తిడి వల్ల ఇలా చేయాల్సి వస్తుందా, లేక ఇది మరీ అతిగా అనిపిస్తుందా అనేది ఒక చర్చనీయాంశం. మరి మీరు ఎప్పుడైనా ఇలా థియేటర్‌లో గానీ, వెకేషన్‌లో గానీ ల్యాప్‌టాప్ ఓపెన్ చేశారా? మీ అనుభవాన్ని కామెంట్స్‌లో షేర్ చేయండి!

