పెద్ద, చిన్న సినిమా ఏదైనా ఓవర్ సీస్ వసూళ్లు అనేవి కీలకంగా మారాయి. దాంతో రెగ్యులర్ థియేటర్ లెక్కలతో పాటు, ఓవర్ సీస్ ని కూడా ఎంత వచ్చిందనేది లెక్కలు వేస్తున్నారు. అయితే అన్ని సినిమాలు అక్కడ ఆడవు. అక్కడ ఆడియన్స్ టేస్ట్ కు అణుగుణమైన సినిమాలే ఆడుతున్నాయి. ఫ్యామిలీలు, ఫన్ సినిమాలు అక్కడ బాగా ఆడుతున్నాయి.
ఈ సంక్రాంతికి మరో ఎంటర్ట్మెంట్ చిత్రంతో వచ్చి హిట్‌ను సొంతం చేసుకున్నారు స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh). అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం జనవరి 14న విడుదలై మంచి వసూళ్లను సొంతం చేసుకుంటోంది. దీంతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Collections) దుమ్ము దులుపుతోంది. అక్కడ ఈ సినిమా వెంకటేశ్ కెరీర్‌లోనే ఆల్‌టైమ్ వసూళ్లు సాధించింది.
ఓవర్సీస్‌లో తొలిరోజు ఈ చిత్రం 7 లక్షల డాలర్లు రాబట్టినట్లు వెల్లడించిన టీమ్ తాజాగా అక్కడ రెండు మిలియన్ డాలర్లు సాధించినట్లు తెలిపింది. వెంకటేశ్ కెరీర్‌లోనే ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే తొలిసారి అని ప్రకటించింది.
కేవలం అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే వంటి దేశాల్లోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ దుమ్ములేపుతోంది. ఈ చిత్రానికి అక్కడి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు వస్తున్నాయి.
ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఇప్పటికే 350K డాలర్ల వసూళ్లు రాబట్టింది. అటు యూకే బాక్సాఫీస్ వద్ద 200K పౌండ్లు వసూళ్లు రాబట్టింది.
విడుదలైన నాటి నుంచి థియేటర్‌లో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తోన్న ఈ చిత్రం ఐదో రోజు రూ.12.75 కోట్లు వసూలు చేసింది. దీంతో ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో ఐదో రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
మొదటి స్థానంలో ‘ఆర్‌ఆర్ఆర్’ (రూ.13.63 కోట్లు) ఉండగా, రెండో స్థానంలో సంక్రాంతికి వస్తున్నాం (రూ.12.75కోట్లు) నిలిచింది. మూడులో ‘అల వైకుంఠపురం’ (రూ.11.43 కోట్లు), నాలుగులో ‘బాహుబలి 2’ (రూ.11.35 కోట్లు), ఐదో స్థానంలో రూ.10.86 కోట్లతో ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ ఉంది.