
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమాపై అంచనాలు, క్రేజ్ మామూలుగా లేవు. తెలుగు ట్రేడ్‌లోనే కాదు, ఇతర భాషల్లో కూడా ఈ సినిమా పై బజ్ క్రియేట్ అయ్యింది. కానీ… ఆ హీట్‌ను క్యాష్ చేసుకోవాల్సిన సమయంలోనే మేకర్స్ పెద్ద తప్పు చేశారు! కంటెంట్ డెలివరీలో డిలే వల్ల, పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు గట్టి ఆటంకం ఏర్పడింది.
తెలుగు వెర్షన్ ఓవర్ సీస్ కంటెంట్ కూడా చివరి నిమిషంలోనే అందింది. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం డబ్బింగ్‌లు కూడా ఆలస్యమయ్యాయి. ముంబైలో ఒక రోజు ప్రమోషన్స్ చేస్తే సరిపోయేది కానీ ఆ చాన్స్‌ను కూడా వదిలేశారు. ఫలితంగా, ఓజీని దేశవ్యాప్తంగా స్ట్రాంగ్ గా లాంచ్ చేసే అవకాశం వృథా అయిపోయింది.
ఓజీ కంటెంట్ వారం ముందే డెలివరీ అయి ఉంటే?
సినిమా ఓపెనింగ్స్ పాన్ ఇండియాలోనే కాకుండా, ఓవర్సీస్‌లోనూ రికార్డ్ లెవెల్లో ఉండేవి. కానీ చివరి నిమిషం వరకు వర్క్ చేస్తూ వచ్చినందుకే మొత్తం ప్లానింగ్ దెబ్బతింది. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక్కటే మాట వినిపిస్తోంది – “మేకర్స్ గోల్డెన్ ఛాన్స్‌ను వృథా చేశారు!”
