‘జెర్సీ’ చిత్రంతో తొలి పరిచయంలోనే తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌. తర్వాత ‘జోడి’, ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ తదితర ఎంటర్‌టైనర్‌లతో సందడి చేసిన ఆమె ఇప్పుడు చాలా ప్రాజెక్టులలో బిజిగా ఉంది. ఆమె చేస్తున్న చిత్రాలు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల అవుతూండటంతో మంచి క్రేజే ఉంది. తాజాగా ఆమె ఓ వెబ్ సీరిస్ కమిటైంది.

‘జెర్సీ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె… మంచి పాత్రల్లో మెరుస్తున్నారు. గతేడాది ‘సైంధవ్‌’, ‘మెకానిక్‌ రాకీ’ చేసిన ఆమె, ఈసారి సంక్రాంతికి బాలకృష్ణతో కలిసి ‘డాకు మహారాజ్‌’తో (Daaku Maharaj)లో కనిపించింది. ఇప్పుడు ఓ తమిళ వెబ్ సీరిస్ ఆమె కమిటైంది. ఆ సీరిస్ పేరు గేమ్.

తమిళ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సీరిస్ ని Applause Entertainment, Escape Artists కలిసి నిర్మిస్తున్నారు. ఈ సీరిస్ ని తూంగవనం ఫేమ్ రాజేష్ ఎమ్ సెల్వ డైరక్ట్ చేయబోతున్నారు. ఈ సీరిస్ లో శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

శ్రద్దా మాట్లాడుతూ… ‘‘పాత్రలో ఎంతో కొంత ప్రాధాన్యముంటే తప్ప శ్రద్ధ ఒప్పుకోదనే పేరు నాకు ఉంది. అందుకు తగ్గట్టుగానే నా కథల ఎంపిక ఉంటుంది. ఏడాదిలో ఆరేడు సినిమాలు చేయాలని పరుగులు పెట్టి అలసిపోవడం కంటే, మంచి కథల్లో భాగం అవ్వాలని ఆచితూచి ప్రయాణం చేయడాన్నే ఇష్టపడతా. అందుకే నా కెరీర్‌ ఇన్నేళ్లుగా విజయవంతంగా కొనసాగుతోంది.

ఇటు దక్షిణాది భాషలు, అటు హిందీ… ఎక్కడి నుంచి మంచి కథలు వస్తే అక్కడ నటిస్తున్నా. భాష విషయానికొస్తే కన్నడ తర్వాత, దానికి దగ్గరగా ఉన్న తెలుగు నాకు సౌకర్యంగా ఉంటుంది. పీరియాడిక్‌ కథలంటే నాకు చాలా ఇష్టం. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ తరహా సినిమాల్లో భాగం కావాలనే కోరిక ఉంది. నిజ జీవితానికి దగ్గరగా ఉన్న కథలన్నా ఇష్టమే. సినిమాలతోపాటు, వెబ్‌ సిరీస్‌ల్లోనూ భాగం అవుతున్నా’’.

, ,
You may also like
Latest Posts from