తండేల్ చిత్రం వారంలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఫిబ్రవరి 14 అయిన నేడు కొత్త సినిమాలు రిలీజ్ అయిన తండేల్ చిత్రం మంచి ఆక్యుపెన్సీ సాధిస్తూ రన్ అవుతుంది. పైగా భారీ ఆశలు పెట్టుకొని రిలీజ్ చేసిన విశ్వక్ సేన్ లైలా చిత్రానికి నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో తండేల్ హవా మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఇక సినిమా రన్ కొనసాగేలా మూవీ టీమ్ కూడా ప్రమోషన్స్ బాగా చేస్తుంది. ఈ సినిమా వందకోట్ల క్లబ్‌లోకి చేరినందుకు చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. అయితే వందకోట్లు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీసింది. ఇది ఫేక్ కలెక్షన్స్ ప్రకటన అని కొందరు అంటూంటే లేదు..నిజంగానే ఈ సినిమా వసూళ్లు పెరిగాయి. అందుకే వందకోట్లులోకి వెళ్లాయని అంటున్నారు.

అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో తొలి వందకోట్ల సినిమాగా ఇది నిలిచిందని ఆదివారం మేకర్స్‌ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ‘అన్‌-సీజన్‌లో విడుదలైనప్పటికీ, ఆదివారాలు తప్ప సెలవులు లేనప్పటికీ, హెచ్‌డీ వెర్షన్‌ తొలిరోజే లీకైనప్పటికీ.. ఆవేమీ ‘తండేల్‌’పై ప్రభావం చూపించలేకపోయాయి.

సెకండ్‌ వీకెండ్‌ ముగియక ముందే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. డొమస్టిక్‌ మార్కెట్లోనే కాక, తెలుగు రాష్ర్టాల్లోని డిస్ట్రిబ్యూటర్స్‌కు కూడా ‘తండేల్‌’ లాభదాయకమైన వెంచర్‌ అయ్యింది. ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ అయి, లాభాల బాటలో పయనిస్తుంది. ఇంతటి విజయానికి కారకులైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని మేకర్స్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

రీసెంట్ గా తండేల్ మూవీ సక్సెస్ మీట్ కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కి కింగ్ నాగార్జున గెస్టుగా వచ్చారు. సక్సెస్ మీట్‌కి వచ్చి చాలా రోజులు అయిపోయిందని.. ఇంతటి విజయాన్ని చైతూకి ఇచ్చిన డైరెక్టర్ చందు మొండేటిని అభినందించారు నాగ్.
అలానే సినిమాలో ప్రతి సీన్ అద్భుతంగా ఉందని.. సాయి పల్లవి యాక్టింగ్, డ్యాన్స్ మరోసా ఇరగదీసిందన్నారు. ఇక తన కుమారుడు ా నాగ చైతన్య యాక్టింగ్ చాలా ఆకట్టుకుందని.. మొదటి నుంచి చివరి వరకూ అద్భుతంగా నటించాడంటూ ప్రశంసించారు.

, , , , ,
You may also like
Latest Posts from