కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించిన సినిమా టికెట్ ప్రైస్ క్యాప్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 23, 2025న హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తూ, ప్రభుత్వం తీసుకున్న ₹200 టికెట్ లిమిట్ పై స్టే విధించింది.

జూలై 2025లో ప్రభుత్వం, కర్ణాటక సినిమాస్ (రెగ్యులేషన్) (అమెండ్‌మెంట్) రూల్స్ – 2025 కింద టికెట్ ధర ₹200కి మించి ఉండకూడదని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీనికి వ్యతిరేకంగా మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలు—హోంబలే ఫిలింస్ (కాంతార ఫేమ్) వంటి వారు—కోర్టును ఆశ్రయించారు.

వారి వాదన ఏమిటంటే, ₹200 టికెట్ లిమిట్‌కు ఎలాంటి స్టడీ, రీసెర్చ్ లేదా డేటా ఆధారాలు లేవు, ఇది పూర్తిగా యాదృచ్ఛిక నిర్ణయం అని.

ఇక హైకోర్టు తాజా తీర్పుతో పవన్ కళ్యాణ్ ‘OG’ టీమ్, రిషభ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ ఆనందంలో మునిగిపోయారు. ఇప్పుడు వారు డిమాండ్ ప్రకారం టికెట్ ధరను నిర్ణయించుకోవచ్చు, ప్రభుత్వ లిమిట్ బారిన పడాల్సిన అవసరం లేదు.

సినీ లవర్స్ మధ్య ఇప్పుడు హాట్ టాపిక్ – టికెట్ రేట్లతో OG & Kantara Chapter 1 బాక్సాఫీస్‌ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టించబోతున్నాయో చూడాలి?

, , , ,
You may also like
Latest Posts from