సితార బ్యానర్ మీద నాగవంశీ నిర్మించిన డాకు మహారాజ్ చిత్రానికి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఆ పాజిటివ్ టాక్‌ స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాలేదన్నది నిజం. అదే సమయంలో లక్కీ భాస్కర్‌కు ఎక్కడా ఒక్క నెగెటివ్ కామెంట్ రాలేదు. కానీ కలెక్షన్స్ మాత్రం చాలా డల్‌గా ఉన్నాయి. ఇక డాకు మహారాజ్‌కు సంక్రాంతి సీజన్ కలిసి వచ్చినా కూడా, మంచి టాక్ వచ్చినా కూడా సరైన వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇలా టాక్ బాగున్నా.. అండర్ పర్ఫామ్ చేయడం మీద నాగవంశీ స్పందించాడు.

నాగవంశీ నిర్మించిన మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా డాకు మహారాజ్, లక్కీ భాస్కర్ అండర్ పర్ఫార్మ్ ల గురించి ఒకరు అడగ్గా లక్కీ భాస్కర్ ఏ సెంటర్స్ లో బాగా రిసీవ్ చేసుకున్నారు. అది ముందే ఊహించాం. ఇక లక్కీ భాస్కర్ చేసేటప్పుడే ఇది కొంత మందికే వర్కౌట్ అవుతుందని, మల్టీప్లెక్స్ సినిమా అని ఫిక్స్ అయ్యారట.. అయితే ఆ టైంలో అమరన్ రావడం.. అది కూడా మల్టీప్లెక్స్ సినిమానే కావడంతో కలెక్షన్లు కాస్త తగ్గాయని నాగవంశీ అన్నాడు.

ఇక డాకు మహారాజ్ ఏయే సెంటర్స్ లో అనుకున్నామో అక్కడ బాగానే లాక్కొచ్చింది.ఐతే ఆ సినిమాలు ఓటీటీలో బాగా రాణిస్తున్నాయని అన్నారు నాగ వంశీ. అలాగే డాకు మహారాజ్‌ ( Daku Maharaj )చిత్రం కలెక్షన్లు తగ్గడానికి నాగ వంశీ కారణం చెబుతూ….ఆ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎఫెక్ట్‌ పడింది.అయితే బాలకృష్ణ గారి వల్ల కొన్ని ఏరియాల్లో భారీ వసూళ్లు వచ్చాయి అని తేల్చారు.

ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నందమూరి ఫ్యాన్స్ డాకు మహారాజ్ సినిమాను సూపర్ హిట్ అనేస్తుంటే సడెన్ గా ఆ సినిమా నిర్మాత అండర్ పర్ఫార్మ్ అనడంపై ఫ్యాన్స్ నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డాకు మహారాజ్ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్య జైశ్వాల్, ఊర్వశి రౌతెలా నటించారు. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిచగా సినిమాకు ఆయన అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.

, , , ,
You may also like
Latest Posts from