ప్రస్తుతం ఎన్టీఆర్ జపాన్‌ లో ఉన్నారు. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవర’ చిత్రం ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ నెల 28న ‘దేవర: పార్ట్‌ 1’ సినిమా జపాన్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ప్రమోషనల్‌ టూర్‌లో భాగంగా ఎన్టీఆర్‌ జపాన్‌ వెళ్లారు.

విడుదలకు ముందు విరివిగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ, అక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ అక్కడ జరిగే ప్రత్యేక ప్రదర్శనలకు హాజరయ్యేందుకు, అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అక్కడ ప్రమోషన్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఆ విషయం తెలుపుతూ ఎన్టీఆర్ పోస్ట్ పెట్టారు.

ఈ ప్రమోషనల్‌ టూర్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తాను హీరోగా చేస్తున్న ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) సినిమా షూట్‌లో ఎన్టీఆర్‌ పాల్గొంటారని సమాచారం.

కల్యాణ్‌ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాలోని తొలి భాగం ‘దేవర: పార్ట్‌ 1’ 2024 సెప్టెంబరు 27న విడుదలైంది. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా (తండ్రి పాత్ర దేవర, కొడుకు పాత్ర వర) నటించి, ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్‌. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ. 500 కోట్లు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా మేకర్స్‌ పేర్కొన్నారు.

, , , ,
You may also like
Latest Posts from