పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ఒక నెల రోజులుగా కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి ఇటలీలో విహారయాత్ర చేస్తూ గడిపారు. తాజాగా ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఇక మళ్లీ షూటింగ్ మోడ్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఏ సినిమా షూట్ లోకి వెళ్లబోతున్నాడనేది అభిమానులకు పెద్ద పజిల్ లా మారింది.
సౌత్‌లో మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో పాన్ ఇండియా సినిమాలకు తెరతీసిన హీరో ప్రభాస్. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నారు.
ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ది రాజా సాబ్’, మంచు విష్ణు ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’, అలాగే హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న భారీ పీరియాడిక్ డ్రామా ‘ఫౌజీ’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు.
ఇవి మాత్రమే కాదు — త్వరలోనే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’, ప్రశాంత్ నీల్ ‘సలార్: శౌర్యాంగ పర్వం’, అలాగే ప్రశాంత్ వర్మ సినిమా కోసం కూడా రెడీ అవుతున్నారు. ఒక్కో ప్రాజెక్ట్‌కి ప్రత్యేకమైన టోన్, విభిన్నమైన క్యారెక్టర్ డిజైన్‌లతో ప్రభాస్ తన కెరీర్‌లో కొత్త చాప్టర్లను రాసేందుకు సిద్ధమవుతున్నారు.
రేపటి నుంచే ‘ఫౌజీ’ షూటింగ్ రీస్టార్ట్!
అయితే ప్రభాస్ ఫౌజీ చిత్రానికే ప్రయారిటీ ఇస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కోసం ప్రభాస్ రేపటి నుంచే సెట్స్‌పైకి అడుగుపెట్టబోతున్నారు. ఈ కొత్త షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్‌లను నిర్మించారు. కథ ప్రకారం ప్రభాస్ ఇందులో ఓ సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు.
ఫౌజీ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్పై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడిన నేపథ్యంలో ఇండియన్ క్రేజీ స్టార్లని ఇందులో నటింపజేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి, జయప్రదలని కీలక పాత్రల కోసం ఎంపిక చేసుకున్నారట.
1940లో సాగే కథతో పీరియాడిక్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇన్‌ఫ్లూయెన్సర్, డాన్సర్ ఇమాన్వి ఇందులో ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది. రొమాంటిక్ వార్ లవ్‌స్టోరీగా రూపొందుతున్నీ సినిమా కోసం ఇప్పటికే కీలక ఘట్టాలని పూర్తి చేశారు.
ఫౌజీ ఇదొక భారీ బడ్జెట్ మూవీ. ఈ ప్రాజెక్ట్‌ని దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాలని ప్లాన్ చేసారు. తన ప్రేమ కోసం యుద్ధం చేసిన ఓ వీర సైనికుడి కథగా ఈ మూవీని దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు.