తమన్నా నటించిన ఓదెల 2 మూవీ కు మంచి బజ్ క్రియేట్ అయ్యిన సంగతి తెలసిందే. వచ్చే వారమే థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు తాజాగా ఓటీటీ పార్ట్‌నర్ పై క్లారిటీ వచ్చింది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ అందించిన ఈ మూవీ డిజిటిల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ గతంలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ గా వస్తోంది.
అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా హక్కుల కోసం రూ.11 కోట్లు చెల్లించారు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఓదెల 2 థియేటర్లలో రిలీజైన తర్వాత కనీసం నాలుగు వారాలకు ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఆ లెక్కన మే మూడో వారంలో ప్రైమ్ వీడియోలోకి ఈ సినిమా రావచ్చు.
ఈ చిత్రాన్ని గ్రాండ్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్ గా మల్టిపుల్ రోల్స్ లో వర్క్ చేశారు. అలాగే డైరెక్షన్ సూపర్ విజన్ ని అందిస్తున్నారు. అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్స్ పై డి. మధు నిర్మిస్తున్నారు.