తెలుగునాట చాగంటివారి ప్రవచనాలు ఎంత పాపులరో తెలిసిందే. ఇప్పుడు హిట్ 3 ట్రైలర్ లో వాటిని వాడేసారు. ‘హిట్‌’ (HIT) యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న సరికొత్త చిత్రం ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’ (HIT 3). నాని (Nani) హీరోగా శైలేశ్‌ కొలను దర్శకత్వంలో ఈసినిమా సిద్ధమవుతోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్. ఇందులో నాని పవర్‌ ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో అర్జున్‌ సర్కార్‌గా కనిపించనున్నారు. తాజాగా ఈసినిమా ట్రైలర్‌ను చిత్ర టీమ్ విడుదల చేసింది.

“ఆపదలో ఉన్న వాళ్లను రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని ఆహో రాత్రుళ్లు కష్టపడతాడో ఆయనే తెలుస్తుంది” అని చాగంటి కోటేశ్వర రావు ప్రవచనం బ్యాక్‍గ్రౌండ్‍లో వస్తుంటే కిడ్నాప్‍ కేసును ఛేదించేందుకు అర్జున్ సర్కార్ ప్రయత్నిస్తుంటాడు.

వరుస హత్యలు.. అర్జున్‌ వాటిని ఎలా ఛేదించాడు అనే కోణంలో ఈ సినిమా సాగనుందనేది ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది. అర్జున్‌ సర్కార్‌గా నాని సంభాషణలు, నటన విశేషంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘హిట్‌ 1, 2’తో పోలిస్తే ఇది చాలా వైల్డ్‌గా ఉన్నట్లు అర్థమవుతోంది. వేసవి కానుకగా మే 1న ఇది విడుదల కానుంది.

, , , ,
You may also like
Latest Posts from