ఇండియన్ సినిమా రేంజ్ అంతర్జాతీయంగా దూసుకువెళ్తోంది. ఆ క్రమంలోనే అల్లు అర్జున్ — అట్లీ అనే భారీ కాంబినేషన్‌తో రూపొందబోతున్న #AA22 ప్రాజెక్ట్ ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘పుష్ప’తో నేషనల్ అవార్డు దక్కించుకున్న బన్నీ, ‘జవాన్’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన అట్లీ.. ఈ ఇద్దరి కలయికపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మాస్ కమర్షియల్ విజన్ లోకి బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె ని ఇప్పుడు తీసుకువచ్చి ఈ సినిమాని మరింత స్పెషల్ గా మార్చేసారు.
బన్నీకి జోడీగా దీపికా పదుకొణె – అధికారిక ప్రకటన!
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న అధికారికంగా ప్రాజెక్ట్ ప్రకటించిన టీమ్, తాజాగా హీరోయిన్ రివీల్ వీడియోను రిలీజ్ చేసింది. అందులో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ సినిమాలో బన్నీకి జోడీగా నటించనున్నట్లు ధృవీకరించారు. ఈ వీడియో చూస్తే, దీపిక పాత్ర ఓ స్టైలిష్ యాక్షన్ షేడ్‌తో కూడినదిగా ఉండనుందని అర్థమవుతోంది.
పునర్జన్మ.. ప్యారలల్ యూనివర్శ్ – విభిన్న కథనంతో సైన్స్ ఫిక్షన్ స్పేస్
AA22 ఒక సై-ఫై థ్రిల్లర్‌గా రూపొందనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పునర్జన్మలు, ప్యారలల్ యూనివర్శ్ నేపథ్యంలో ఒక విభిన్నమైన కథను అట్లీ మలచనున్నారని సమాచారం. ఈ కథకు తగ్గట్టే, ఓ కొత్త సొంత ప్రపంచం (Original Universe) కోసం ప్రత్యేకంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
హాలీవుడ్లో పలు బిగ్ ప్రాజెక్ట్స్‌కు పని చేసిన VFX కంపెనీ కూడా ఈ చిత్రానికి అసిస్టింగ్ చేస్తోంది. అంటే ఇది నేరుగా ఓ పాన్-ఇండియా ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. పాన్-గ్లోబల్ ఆడియన్స్‌కి అనుసంధానమైన విజన్‌తో నిర్మితమవుతుంది.
సన్ పిక్చర్స్‌పై భారీ బడ్జెట్ – షూటింగ్ త్వరలో!
ఈ చిత్రాన్ని Sun Pictures సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే అనేక సూపర్‌హిట్ తమిళ చిత్రాలకు బ్యాకింగ్ ఇచ్చిన ఈ సంస్థ, బన్నీ ప్రాజెక్ట్‌కు భారీ బడ్జెట్ కేటాయించింది. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ చివరిదశకు చేరిన ఈ సినిమా, ఈ ఏడాది ద్వితీయార్ధంలో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.
‘కల్కి 2898 A.D’తో తొలి తెలుగు చిత్రంలో మెరిసిన దీపికా పదుకొణె, ఇప్పుడు బన్నీ ప్రాజెక్ట్‌తో టాలీవుడ్ క్రౌడ్‌కు మరింత దగ్గర కానుంది. ఈ ప్రాజెక్ట్‌తో ఆమెకు ఒక పక్క మాస్ మార్కెట్ ఓపెనింగ్ లభించనుండగా, మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఇది ఒక సర్ప్రైజ్ బ్లెండింగ్గా మారింది.