హీరో సుధీర్‌బాబు తాజా మూవీలో పూర్తిగా బీస్ట్ మోడ్‌లోకి ఎంటర్ అయ్యారు. ఆర్.ఎస్.నాయుడు డైరెక్షన్లో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందబోయే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఇదంతా ఆయన పుట్టినరోజు స్పెషల్ గిఫ్ట్‌గా వదిలిన బాంబే అనుకోవచ్చు!
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీలుక్ పోస్టర్లో సుధీర్‌బాబు రగిలిపోతున్న విజువల్స్‌తో ఫ్యాన్స్‌లో హైపే క్రియేట్ అయింది. మెట్లపై శవాల మధ్య, షర్ట్ లేకుండా ఓ భారీ ఆయుధాన్ని చేతబట్టి నడుస్తున్న ఆయన లుక్ ఇంటెన్స్కి కొత్త డెఫినిషన్ ఇచ్చిందంటున్నారు.
“Broken Soul… On a Brutal Celebration” అన్న ట్యాగ్‌లైన్ మాత్రం ఈ సినిమా ఎమోషనల్‌గా కాదు… బ్రూటల్‌గా బాదేస్తుందనే సంకేతం ఇచ్చింది.
సినిమా ఒక రఫ్ & రా సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ అని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. “ఈ పాత్ర కోసం సుధీర్ పూర్తిగా ట్రాన్స్ఫర్మ్ అయ్యారు. ఫిజికల్‌గా, మెంటల్‌గా – ఇది ఆయన కెరీర్‌లోని మోస్ట్ ఫియర్స్ట్ అవతారం,” అని యూనిట్ వర్గాలు చెప్పాయి.
ఇంకా నటీనటుల వివరాలు, టెక్నీషియన్ లైనప్ త్వరలో బయటకు రానుంది. అయితే ప్రస్తుతానికి… బీస్ట్ సైడ్ ఆఫ్ సుధీర్‌బాబు ఓపెన్ అయిందన్నమాట!