నితిన్ కు అర్జెంట్ గా హిట్ కావాలి. కరోనా టైమ్‌లో వచ్చిన భీష్మ తర్వాత ఇప్పటి వరకు మరో హిట్ లేదు ఈ హీరోకు. మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, చెక్, రంగ్ దే, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్.. మొన్నొచ్చిన రాబిన్ హుడ్ అంటూ చాలా చేసారు కానీ ఏదీ హిట్ కాలేదు. దాంతో నితిన్ తన తాజా చిత్రం తమ్ముడు పైనే ఆశలు పెట్టుకున్నాడు.. కానీ ఆ సినిమా రకరకాల కారణాలతో రిలీజ్ కు నోచు కోవటం లేదు.

కానీ తమ్ముడు సినిమా కథలోని హీరో స్ట్రగుల్‌తో పాటు… ఆఫ్-స్క్రీన్‌లో కూడా ఫైట్ తక్కువేమీ లేదు. మొదట ‘తమ్ముడు’ని జులై 4న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యింది. అంతలోనే విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘కింగ్ డమ్’ అదే డేట్‌ను ఆక్రమించింది.

అందులో క్రేజ్, బడ్జెట్, మార్కెట్ ఒత్తిళ్లు అన్ని కలసి వచ్చాయి. దాంతో దిల్ రాజు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

ప్రస్తుతం ‘తమ్ముడు’ సినిమా కొత్త విడుదల తేదీ కోసం ఎదురు చూస్తోంది. తాజా టాక్ ప్రకారం ‘కింగ్ డమ్’ రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత, అంటే జూలై 18 లేదా 25న సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయి.

,
You may also like
Latest Posts from