రవితేజ ఫ్యాన్స్‌కి ఇది మామూలు సినిమా కాదు… మళ్ళీ వాళ్ల హీరో మాస్ రూట్‌లోకి వస్తున్నాడని జోరుగా బలంగా వినిపిస్తున్న పేరే మాస్ జాతర! అభిమానులంతా ఎదురు చూస్తున్న ఈ ఫెస్టివల్‌కు వేదిక సిద్ధమవుతోంది.

శ్రీలీల హీరోయిన్‌గా, భాను భోగవరపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌, అలాగే ఫస్ట్ సింగిల్‌ “తూ మేరా లవర్” మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ మాస్ ఫెస్టివల్‌కి విడుదల తేదీ కూడా లాక్ అయిపోయింది.

👉 ఆగస్టు 27 – ప్రపంచవ్యాప్తంగా మాస్ జాతర పండుగ మొదలవుతుంది!

మొదట ఈ సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేశారు. తర్వాత మే – జూలైకి మారారు. చివరికి ఆగస్ట్ రిలీజ్‌కే సెటిల్ అయ్యారు. ఎందుకంటే ఆ సమయంలో వినాయక చవితి పండగ సెలవులు ఉండడంతో పాటు, ఇంకా పెద్ద సినిమాల క్లాష్ లేవు అన్నది ప్లస్ పాయింట్.

ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది.

👉 ఈసారి మాస్ రాజా రవితేజకి ఇది రిడెంప్షన్ మూవీ లాంటి విషయం అందరికీ తెలిసిందే.
ఎందుకంటే ఆయన గత చిత్రం “మిస్టర్ బచ్చన్” బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.
కాబట్టి “మాస్ జాతర”తో తిరిగి మాస్‌లో తన సింహాసనాన్ని తిరిగి సాధించాలని భావిస్తున్నారు.

ఇప్పుడు ప్రశ్న ఒక్కటే – మాస్‌కి మళ్లీ మాస్ రాజా నిజంగానే జాతర ఇవ్వబోతున్నారా?

, ,
You may also like
Latest Posts from