‘హనుమాన్’తో దేశవ్యాప్తంగా తన శక్తిని చాటిన తేజ సజ్జ ఇప్పుడు మరో విభిన్నమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్యాన్ ఇండియా మార్కెట్లో అడుగుపెట్టి, తన క్రేజ్‌ను పది రెట్లు పెంచుకున్న తేజ.. ఇప్పుడు తన నెక్స్ట్ మిషన్కి సిద్ధమయ్యాడు. అదే ‘మిరాయ్’ (Mirai).
ఇది ఓ హిస్టారికల్ – అడ్వెంచర్ – ఫాంటసీ థ్రిల్లర్. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, తెలుగు సినిమా విజువల్ స్కేల్‌కి ఒక బెంచ్‌మార్క్ కావాలని లక్ష్యంగా మన ముందుకు వస్తోంది.
తాజాగా విడుదలైన టీజర్లోనే ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి.
“జరగబోయేది మారణహోమం.. శిధిలం కాబోతుంది అశోకుడి ఆశయం…” అనే డైలాగ్‌తో టీజర్ ఓ మిస్టిక్ టోన్‌ను సెట్ చేసింది. అనంతరం అశోకుడి యుద్ధ సన్నివేశాలు, పౌరాణిక థీమ్‌లు టీజర్లో మెరిశాయి.
అలాగే టీజర్లో అసాధారణంగా మంచు మనోజ్ విలన్‌గా బరిలోకి దిగుతాడు.
“కలియుగంలో పుట్టిన శక్తి దీన్ని ఆపలేకపోయింది” అన్న డైలాగ్ వచ్చిన తర్వాత అతని రాక్షస స్వభావాన్ని చూపించారు. దాంతో కథలో విపరీతమైన కాన్ఫ్లిక్ట్ను స్టబ్లిష్ చేశారు.
ఆ ప్రమాదాన్ని ఆపే ఆయుధంగా పరిచయం చేయబడినది ‘మిరాయ్’. అదే టైంలో హీరో తేజ సజ్జ ఎంట్రీ ఇస్తాడు. శక్తివంతమైన ఫైటింగ్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను ఊరించేలా చేస్తాడు.విజువల్స్ దమ్మున్నాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ బడ్జెట్ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రాఫిక్స్, క్యామేరా వర్క్, ఆర్ట్ డైరెక్షన్ సినిమాకి భిన్నమైన మూడ్‌ను క్రియేట్ చేశాయి.
మొదటగా ఆగస్ట్ 1 రిలీజ్ డేట్‌గా ప్రకటించిన ఈ సినిమాను, కొన్ని unavoidable కారణాల వల్ల సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది టీం. కానీ రిలీజ్ డేట్ మార్చినా హైప్ తగ్గలేదు. ఎందుకంటే ఈ టీజర్ మూవీ స్థాయిని నిరూపించింది.
ఇప్పుడు తెలుగు సినీ అభిమానులు ‘మిరాయ్’ కోసం కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు.
హనుమాన్ తర్వాత తేజ ఇంకెంత దూకుడు చూపిస్తాడో చూడాల్సిందే!
ఈ సినిమా నిజంగా ప్యాన్ ఇండియా స్క్రీన్‌పై తెలుగుళ్ల శౌర్యాన్ని మరోసారి చూపించగలదా? అన్నది చూడాలి. కానీ టీజర్ మాత్రం “బాటలే కాదు… యుద్ధం కూడా రెడీ” అనేలా ఉంది!