రజినీకాంత్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్. అది కేవలం సినిమా కాదు… ఒక సంచలనం. అదే సంకేతాల్ని ఇప్పుడు ‘కూలీ’ టైటిల్ గ్లింప్స్ ఒకే ఒక్క 60 సెకన్లలో ప్రూవ్ చేసింది. పాట, మాస్, స్టైల్ – అన్నీ కలిపి అభిమాన ప్రేక్షకుల్లో ఒక విధమైన హైప్ క్రియేట్ చేశాయి. దాంతో బిజినెస్ కూడా భారీగానే జరుగుతోంది.
ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం – ‘కూలీ’ భారీగా రూ.500 కోట్ల బిజినెస్‌ను టార్గెట్ చేస్తోంది. ఆ డిటేల్స్ చూద్దాం.
నాన్-థియేట్రికల్ బిజినెస్ – ఏకంగా ₹250 కోట్లు!
డిజిటల్, శాటిలైట్, ఆడియో హక్కుల ద్వారా ఇప్పటికే రూ.250 కోట్లు ఖాతాలో పడిపోయాయి.
ఈ డీల్‌లు ‘గ్లింప్స్’ రివీల్ అయిన కొన్ని రోజులకే క్లోజ్ కావడం గమనార్హం.
థియేట్రికల్ బిజినెస్ అంచనాలు:
ఓవర్సీస్ బిజినెస్: రూ.80 కోట్లు
తమిళనాడు డిస్ట్రిబ్యూషన్: రూ.100 కోట్లు
తెలుగు రాష్ట్రాలు: రూ.40 కోట్లు
ఇతర రాష్ట్రాలు (హిందీ బెల్ట్ & కర్ణాటక): రూ.50 కోట్లకు పైగా
ఇవన్నీ కలిపితే థియేట్రికల్ బిజినెస్ రూ.250 కోట్లకు మించుతోంది.
రోబో -2 ‘2.0’ తర్వాత తమిళం నుంచి బయట మార్కెట్లో దూసుకెళ్లే మరో పాన్-ఇండియా మాస్ మానియా ఇది అని ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు. లోకేశ్ స్టైల్, రజినీ స్టార్డమ్ – ఇవన్నీ కలిపి ఈ సినిమాను బాక్సాఫీస్ మేనియా వైపు నడిపిస్తున్నాయనడంలో సందేహం లేదు.