2015లో విడుదలైన బాహుబలి: ది బిగినింగ్, 2017లో వచ్చిన బాహుబలి: ది కన్‌క్లూజన్ — ఈ రెండు సినిమాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 2,460 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారత సినీ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని రాసిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. రాజమౌళి దర్శకత్వం, ప్రభాస్, రానా, అనుష్కల అద్భుత నటనతో ఈ సినిమాలు భారతీయ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాయి.

ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత… బాహుబలి మ్యాజిక్ మళ్లీ తిరిగి వస్తోంది!

2025 అక్టోబర్‌లో బాహుబలి: ది బిగినింగ్ 10th యానివర్సరీ సందర్భంగా, మేకర్స్ ఓ గ్రాండ్ రీ-రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈసారి ట్విస్ట్ అదిరిపోతుంది! రెండు సినిమాల్లోని అత్యంత పవర్‌ఫుల్, కీలక సీన్లను కలిపి ఒకే సినిమాగా మార్చి థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. అంటే… పూర్తి కథ, ఒకే సారి, ఫ్రెష్ ఎక్స్‌పీరియెన్స్‌తో!

శోభు యార్లగడ్డ సోషల్ మీడియా ద్వారా ఈ బిగ్ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ… ఇది కేవలం రీ-రిలీజ్ కాదని, ఒక సంవత్సరం పొడవు ఉత్సవమని చెప్పారు. ఫ్యాన్స్ కోసం స్పెషల్ సర్ప్రైజులు, నోస్టాల్జిక్ మోమెంట్స్ అన్నీ రాబోతున్నాయి.

ఇది కేవలం సినిమా కాదు…రెవిల్యూషన్ !

బాహుబలి సినిమా ప్రభాస్, రానా, అనుష్క వంటి గొప్ప కాంబినేషన్ ని… విజువల్స్, భావోద్వేగాలు, కీరవాణి మ్యూజిక్‌ ని భారీగా తీసుకొచ్చింది. ప్రభాస్‌ను పాన్-ఇండియా ఐకాన్‌గా మార్చింది. రాజమౌళిని లెజెండరీ డైరెక్టర్‌గా నిలబెట్టింది.

ఇప్పుడు ఆ మేజిక్‌కి తిరిగి టైం వచ్చింది! థియేటర్ టికెట్లకు సిద్ధంగా ఉండండి!

, , , , ,
You may also like
Latest Posts from