ప్రముఖ యాంకర్‌ ఉదయ భాను — ఎప్పుడూ ఎనర్జీతో, స్పాంటేనిటీతో మెప్పించే యాంకర్‌. బుల్లితెరపై, లైవ్ ఈవెంట్లలో ఆమె మైక్ పట్టుకుంటే ప్రేక్షకుల్లో సందడి మొదలవుతుంది. కానీ ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఒక సినిమా ఈవెంట్‌లో ఆమె చేసిన ఓ వ్యాఖ్య… సోషల్ మీడియా వేదికగా పెద్దగా వైరల్ అవుతోంది. కారణం? ఆమె మాట్లాడిన ఓ చిన్న మాట.

పవన్ కళ్యాణ్ పాట… అర్థం కాకుండా ప్రశ్న?

ఈ వేడుకలో డైరెక్టర్ జ్యోతికృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ – హరి హర వీరమల్లు సినిమా గురించి వివరాలు వెల్లడిస్తుండగా… మధ్యలో ఉదయ భాను అతని మాటలు తడబాటు పెట్టేలా ప్రశ్న వేసింది:

“మీ మాటలు వింటుంటే… ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఓ పాట పాడినట్టుందే?”

అంతే కాకుండా తాను చాలా ఇంటెలిజెంట్ ప్రశ్న వేసానన్నట్టు, వెంటనే —
“విడుదల వరకూ సీక్రెట్‌గా ఉంచాలంటే ఫర్లేదు…”

కానీ వాస్తవం ఏమిటంటే…

పవన్ కళ్యాణ్ ఆలపించిన “మాట వినాలి” పాట ఎప్పుడో విడుదలై సోషల్ మీడియాలో అందరికీ తెలిసిపోయిన విషయం. ఇది పూర్తిగా పబ్లిక్ డొమెయిన్‌లో ఉన్న విషయమే. అయితే ఆమె ఈ విషయాన్ని తెలియనట్టుగా ప్రస్తావించడంతో, డైరెక్టర్ జ్యోతికృష్ణ కాస్త తికమకపడి, ఎలాంటి సమాధానమిచ్చకుండా మౌనం వహించాల్సి వచ్చింది. మాట్లాడితే మరింతగా అవమానం అవుతుందనే భయం వేసింది ఆయనకు!

ఏదైమైనా ఉదయ భాను వంటి సీనియర్ యాంకర్ కూడా కొన్ని సందర్భాల్లో సరిగ్గా రీసెర్చ్ లేకుండా మాట్లాడితే ఏ రేంజ్‌లో అవమానం జరిగితే అలా జరుగుతుందనేది ఇది రుజువు చేసింది. మరోవైపు, హరి హర వీరమల్లు సినిమా ప్రమోషన్‌లు ఎంత కనెక్ట్ కాలేకపోతున్నాయో కూడా ఈ ఘటన బట్టే అర్థమవుతోంది. పవన్ పాడిన పాటను కూడా జనసామాన్యం గుర్తు పెట్టుకోకపోవడం గమనార్హం.

#Hari Hara Veeramallu, #Nidhi Agarwal, #Pawan Kalyan, #Udaya Bhanu

By admin