తెలుగు సినిమాల్లో కామెడీ తో ప్రేక్షకుల మనసులు గెలిచిన పలువురు నటులు గతంలో దర్శకత్వం వైపు అడుగులు వేశారు. ఎంఎస్ నారాయణ, అవసరాల శ్రీనివాస్, వేణు, ధనరాజ్ లాంటి వారు తమ సత్తా ఆ డిపార్ట్మెంట్‌లో కూడా చూపించారు. ఇప్పుడు ఆ జాబితాలో మరో క్రేజీ పేరు జాయిన్ కాబోతోంది – రాహుల్ రామకృష్ణ!

‘అర్జున్ రెడ్డి’, ‘జాతిరత్నాలు’ లాంటి హిట్ సినిమాలతో, తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో యువతలో క్రేజీ ఇమేజ్ సంపాదించిన రాహుల్ రామకృష్ణ… ఇప్పుడు దర్శకుడిగా తన తొలి ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన రాహుల్, నటుల ఎంపిక ప్రక్రియ కూడా మొదలుపెట్టేశాడట. సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

తెలుగు సినిమా కొత్త తరం కామెడీ హీరోలలో ప్రియదర్శి – రాహుల్ రామకృష్ణ ఇద్దరూ ఒకే రేసులో దూసుకెళ్తూ స్టార్ కామెడీయన్స్‌గా నిలిచారు. ఇప్పుడు ఆ జాబితాలో రాహుల్ తనకంటూ డైరెక్టర్‌ ట్యాగ్‌ను కూడా జత చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

అంటూ కామెడీతో నవ్వించిన రాహుల్, ఇప్పుడు తన కలాన్ని చూపించబోతున్న దర్శకుడిగా ఎలా మెప్పిస్తాడో చూడాలి!

You may also like
Latest Posts from