తమిళ సినిమా ఇండస్ట్రీలో తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ భారీ సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి, కంటెంట్ బలం మీదే Rs. 100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు ఆడియన్స్ మనసులు కూడా గెలుచుకుంటోంది. ఓటిటిలో రిలీజ్ అయిన తర్వాత, తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూసి తెగ మెచ్చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మన హీరోలు కూడా ఈ డైరక్టర్ పై దృష్టి పెట్టారు.

ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు అభిషన్ జీవింత్, తెలుగు స్టార్ హీరో నేచురల్ స్టార్ నానిని హైదరాబాద్లో కలవడం హాట్ టాపిక్ అయింది. నిన్న రాత్రి నానిని ఆయన కార్యాలయంలో కలిసి, భవిష్యత్తులో కలిసి పని చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశాడు. అభిషన్ నిజంగా నానీకి హార్డ్‌కోర్ ఫ్యాన్ అని చెప్పకనే చెప్పాడు. ఆయన త్వరలోనే ఓ కథ నేరేట్ చేయబోతున్నాడట.

అభిషన్ ట్వీట్ చేస్తూ,
“What a day! Truly honoured to have met you, @NameisNani sir. You’re such a humble and grounded person. The way you spoke about the film in such detail made it more special for me. Thank you :)” అని పోస్ట్ చేశాడు.

‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సక్సెస్ తర్వాత అభిషన్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంకా అనౌన్స్ చేయలేదు. మరోవైపు నాని త్వరలో ‘ది పారడైజ్’ సినిమా సెట్స్‌లో జాయిన్ కాబోతున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో మరో భారీ సినిమా కూడా లైన్లో ఉంది.

సినిమాల కోసం కొత్త దర్శకుల్ని ఎంకరేజ్ చేసే హీరోగా పేరున్న నాని – ఇప్పుడు తమిళ టాలెంట్‌తో జట్టు కట్టుతాడా? అని ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

, ,
You may also like
Latest Posts from