నాగార్జున (Nagarjuna), ధనుష్‌ (Dhanush), రష్మిక (Rashmika) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర’ (Kuberaa). శేఖర్‌ కమ్ముల దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్‌ 20న (kuberaa release date) తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్‌తో మెల్లగా ఊపందుకున్న ‘కుబేరా’ ఇప్పుడు థియేటర్ల దిశగా వేగంగా దూసుకెళ్తోంది. సినిమా సెన్సార్ సర్టిఫికేట్, బడ్జెట్, ప్రీ-రిలీజ్ బిజినెస్—all set & locked.

ఇక ‘కుబేర’ మూవీ రన్‌టైమ్‌ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. సెన్సార్‌బోర్డు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. బోర్డు సూచనల మేరకు మార్పు చేర్పులు చేసిన తర్వాత 182 నిమిషాల 38 సెకన్ల నిడివితో ‘కుబేర’ థియేటర్స్‌లో విడుదల కానుంది. అంటే 3 గంటల 2 నిమిషాలకు పైనే మూవీ రన్‌టైమ్‌ ఉండటం గమనార్హం.

ఇప్పటివరకూ స్టార్ హీరోలు, భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కలిగిన చిత్రాలు మాత్రమే 3 గంటలకు పైన ఉన్నాయి. సోషల్‌ డ్రామా ఈ స్థాయిలో రన్‌టైమ్‌ కలిగి ఉండటం సినిమా కంటెంట్‌పై టీమ్‌కు ఉన్న నమ్మకాన్ని చెప్పకనే చెబుతోంది.

🔹 కమ్ముల కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్ ఫిల్మ్!

శేఖర్ కమ్ముల ఇంతవరకు ఇలా భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో సినిమా చేయలేదు. సునీల్ నారంగ్ మరియు పుష్కుర్ రామ్మోహన్‌రావు నిర్మించిన ఈ చిత్రం బడ్జెట్ దాదాపుగా ₹120 కోట్లకు పైగా ఉంది — ఇది కమ్ముల కెరీర్‌లో హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్‌గా నిలుస్తోంది.

🔹 సెన్సార్, రన్‌టైమ్ & థియేట్రికల్ టార్గెట్:
సెన్సార్ రిపోర్ట్: U/A సర్టిఫికేట్

రన్‌టైమ్: 181 నిమిషాలు (3 గంటలకు దగ్గరగా)

థియేట్రికల్ బిజినెస్: దాదాపు ₹65 కోట్లు

బ్రేక్ ఈవెన్ టార్గెట్: ₹120 కోట్లు గ్రాస్ కలెక్షన్ రావాలి

🔹 నాన్-థియేట్రికల్ బిజినెస్ – Safe Zone లో నిర్మాతలు!
ఓటీటీ హక్కులు: Prime Video

శాటిలైట్ రైట్స్: Star Maa

మ్యూజిక్ హక్కులు: Aditya Music

ఈ మూడు కీలక విభాగాల్లో కూడా నిర్మాతలకు మంచి డీల్స్ దక్కడంతో, మొత్తం బిజినెస్ దాదాపు ₹150 కోట్ల వరకు లాక్ అయిందని టాక్.

🔹 బుకింగ్స్ & మార్కెట్ రెస్పాన్స్:

తెలుగు స్టేట్స్: అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే నడుస్తున్నాయి

తమిళంలో: క్రేజ్ కొంత వెనుకబడినట్టే ఉంది

ఓవర్సీస్: ప్రీ-సేల్స్ అద్భుతంగా ఉన్నాయి, ముఖ్యంగా USA మార్కెట్లో

ఫైనల్ గా :

‘కుబేరా’ ఓ క్లాస్ డైరెక్టర్ నుండి వచ్చిన మాస్ బడ్జెట్ మూవీ. సినిమా టెక్నికల్‌గా, బిజినెస్ పరంగా టార్గెట్ పెద్దదే అయినా, ట్రైలర్‌తో వచ్చిన క్రేజ్, ప్రభావవంతమైన స్టార్కాస్ట్ కారణంగా ట్రేడ్ వర్గాలు పాజిటివ్ వైబ్ చూపిస్తున్నాయి.

ఇక, థియేటర్‌లో సినిమా ఎలా కనెక్ట్ అవుతుందో అన్నదే అసలైన పరీక్ష!

, , , ,
You may also like
Latest Posts from