పవన్ కల్యాణ్ నటించిన మోస్ట్ డిలేయిడ్ ఫిల్మ్ హరి హర వీరమల్లు – పార్ట్ 1: స్వోర్డ్ vs స్పిరిట్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కానీ ఈ సారి కారణం… రిలీజ్ విషయమై కాదు, డీల్ మేటర్ కు!
ఓటీటీ దిగ్గజం ప్రైమ్ వీడియో, ఈ సినిమాకు అప్పటికే డిజిటల్ హక్కులు సంపాదించగా… తాజాగా ఆ డీల్‌కి పెద్ద మినహాయింపును ఇచ్చిందట. దీంతో పవన్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
రూ.75 కోట్లు నుంచి తగ్గిన డీల్
ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ హక్కులు రూ. 75 కోట్లకు ప్రైమ్ వీడియో తీసుకున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. కానీ సినిమా తరచూ వాయిదాలు పడుతూ ఉండటంతో, రూ. 10 కోట్లు తగ్గించి కొత్త అగ్రిమెంట్ వేసినట్టు ఇండస్ట్రీ టాక్.
ఇటీవల 12 జూన్ రిలీజ్‌ను మరోసారి వాయిదా వేయడంతో, ఇప్పటివరకు టీమ్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదే సమయంలో డీల్ తగ్గిందని తెలిసిన అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.
డీల్ రేటు మరింతగా తగ్గించాలన్న ప్రైమ్ వీడియో?
నూతన విడుదల తేదీ ఖరారు చేసేందుకు ఏఎం రత్నం టీమ్, ప్రైమ్ వీడియోతో పలు చర్చలు జరిపినట్టు సమాచారం. కానీ తాజా సమాచారం ప్రకారం… ప్రైమ్ వీడియో వారు డీల్‌ను మరింతగా రూ. 5-10 కోట్ల వరకు తగ్గించాలని సూచించగా, నిర్మాతలు ఇందుకు ఒప్పుకోవడం లేదట.
దీంతో కొత్త రిలీజ్ డేట్ ప్రకటన వాయిదా పడినట్టు తెలుస్తోంది.
మరికొన్ని గంటల్లో అధికారిక ప్రకటన?
మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ విడుదల చేస్తూ, ఈ రోజు ఉదయం 7:23కు ఓ కీలక ప్రకటన వస్తుందని తెలిపారు. ఇది రిలీజ్ డేట్ అయి ఉండొచ్చు లేదా మరో సర్పైజ్ అయి ఉండొచ్చు.
ఏదైమైనా …
పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు OTT డీల్ విషయంలోనే గందరగోళంలో పడడం చర్చనీయాంశమైంది. వాయిదాల వల్ల మార్కెట్ క్రేజ్ తగ్గుతోందా? OTT ప్లాట్‌ఫారమ్‌లు ఆర్థికంగా కొత్త షరతుల్ని విధిస్తున్నాయా? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.