తమిళ ఇండస్ట్రీలో ఓ ఇంటెన్స్ డైరెక్టర్ అంటే గుర్తుకు వచ్చేది వెట్రిమారన్. స్టార్ హీరో ధనుష్‌తో కలిసి ‘ఆడుకాలం’, ‘వడ చెన్నై’, ‘అసురన్’ వంటి మైల్‌స్టోన్ సినిమాలు చేసిన ఈ కాంబోలో ఇటీవల విభేదాలు తలెత్తాయన్న పుకార్లు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటన్నింటికీ వెట్రిమారన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. “ధనుష్‌తో నాకు ఎలాంటి గొడవ లేదు, అది పూర్తిగా తప్పుడు ప్రచారం,” అని ఆయన అన్నారు.

శింబుతో సినిమా చేస్తున్నా… నిర్మాత మాత్రం ధనుష్!

శింబుతో చేస్తున్న తన కొత్త సినిమా గురించి వివరాలు షేర్ చేసిన వెట్రిమారన్, “ఈ కథ వడ చెన్నై యూనివర్స్‌లో సాగే కథే కానీ, అది ఆ సినిమాకు సీక్వెల్ మాత్రం కాదు,” అని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌కు ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని, అదే అసలు పుకార్లకు చెక్ పెట్టే సాక్ష్యం అని చెప్పొచ్చు.

“ధనుష్‌ ఎప్పుడు నాకు అండగానే ఉన్నారు”

ఈ సందర్బంగా ధనుష్‌పై తన గౌరవాన్ని వ్యక్తం చేసిన వెట్రిమారన్, “ఎప్పుడూ నా పనుల్లో జోక్యం చేయడు. అసలు నేను ఓసారి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అడగకముందే అడ్వాన్స్ ఇచ్చి నన్ను ఆదుకున్నాడు,” అని గుర్తుచేసుకున్నారు. ఇలాంటి వ్యక్తితో తాను గొడవపడతానా? అని ఆయన ప్రశ్నించారు.

శింబు–ధనుష్ మధ్య కూడా మంచి రిలేషన్

ఈ సినిమాలో శింబు హీరోగా నటిస్తున్నప్పటికీ, ధనుష్‌తో ఆయనకు ఎలాంటి విభేదాలు లేవని, ఇద్దరూ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ఆసక్తిగా తీసుకుంటున్నారని వెట్రిమారన్ స్పష్టం చేశారు.

పాయింట్ క్లియర్ – వెట్రిమారన్–ధనుష్ మధ్య గొడవలు లేవు!

శింబుతో సినిమా – ధనుష్‌ సపోర్ట్‌తోనే వెట్రిమారన్ ముందుకు వస్తున్నారు!

, , ,
You may also like
Latest Posts from