బాక్సాఫీస్ వద్ద భారీ హైప్‌తో రిలీజ్ అయిన కూలీ & వార్ 2 — ఇప్పుడు థియేటర్లలో అంతగా మెప్పించలేకపోయాయి. ఈ వీకెండ్ థియేటర్లను కుదిపేస్తాయని భావించిన ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు, ప్రేక్షకులను నిరాశపరిచాయి.

కూలీ — లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, రజనీకాంత్ హీరోగా వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్‌కి మిక్స్డ్ టాక్ వస్తోంది. కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌లో లోపాలు ఉన్నాయని చాలా మంది చెబుతున్నారు.

వార్ 2 — ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను భారీగా ప్రమోట్ చేసినా, ఆడియెన్స్, క్రిటిక్స్ ఇద్దరూ బోరింగ్‌గా ఉందని కామెంట్ చేస్తున్నారు.

థియేటర్‌కి వెళ్లకుండా ఇంట్లోనే చూసేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ — ఈ రెండు సినిమాలు త్వరలోనే ఓటీటీలో రానున్నాయి. కూలీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా, వార్ 2 ను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ చేయనుంది. రిపోర్ట్స్ ప్రకారం, రెండూ అక్టోబర్ రెండో లేదా మూడో వారం నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చే అవకాశముంది. కాబట్టి డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్‌ కోసం వెయిట్ చేయొచ్చు.

, , , , , , , , , , ,
You may also like
Latest Posts from