టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగ వంశి మళ్లీ ఎక్స్ (X.com) లో ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్–హృతిక్ రోషన్ మల్టీస్టారర్ “War 2” తెలుగు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో, భారీ నష్టాలు ఎదుర్కొన్న నాగ వంశి ఒక్కసారిగా మౌనంలోకి వెళ్లిపోయారు. ఎన్‌టీఆర్ డైహార్డ్ ఫ్యాన్ అయిన ఆయన, తెలుగు రైట్స్ కొని బాగా నష్టపోవడంతో, ట్రోల్స్ ఆయనపై వేట ప్రారంభించారు.
“దుబాయ్ వంశి” అంటూ ట్రోల్స్ ఫుల్ ట్రాక్
ఎన్టీఆర్ రైవల్ హీరోల అభిమానులు నాగ వంశి కనిపించకపోవడాన్ని “దుబాయ్ వంశి” అంటూ ఆటపట్టించారు. “డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేస్తే ఎత్తలేదట… దుబాయ్ కి పారిపోయాడు” అంటూ మీమ్స్ పేలాయి.
నాగ వంశి రీ-ఎంట్రీ: “Sorry to Disappoint…”
అయితే నాగ వంశి తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. “నన్ను మిస్ అవుతున్నారా? ఇంకా పారిపోవడానికి టైమ్ రాలేదు. కనీసం 10-15 ఏళ్లు ఇండస్ట్రీలోనే ఉంటాను!” అంటూ సార్కాస్టిక్‌గా పోస్ట్ చేశారు. అంతేకాదు, త్వరలోనే రవితేజ “Mass Jathara” ప్రమోషన్స్‌లో మళ్లీ కలుస్తానని క్లారిటీ ఇచ్చారు.
“War 2 flop అయితే ఇక స్టేట్‌మెంట్స్ ఇవ్వను” అన్న వంశి
ఇక ట్రోల్స్ ఎందుకు వంశిని టార్గెట్ చేస్తున్నారంటే, కారణం ఆయన హైపర్ స్టేట్‌మెంట్స్. “విజయ్ దేవరకొండ ‘Kingdom’ అంటే మరో KGF” అని చెప్పడం, “War 2 ఫ్లాప్ అయితే స్టేట్‌మెంట్స్ ఇవ్వడం మానేస్తా” అని డేరింగ్ డైలాగ్ పెట్టడం… అన్నీ చివరికి ఆయన్నే వెనుకేసుకొచ్చాయి.
సితార ఎంటర్టైన్‌మెంట్స్ + హారిక & హాసిని క్రియేషన్స్
డిజే టిల్లు, టిల్లు స్క్వేర్, మాడ్ వంటి యూత్ హిట్స్ ఇచ్చిన నాగ వంశి, త్రివిక్రమ్ బ్యానర్‌లో కూడా కో-ప్రొడ్యూసర్. ఆయన ఓవర్‌యాక్టివ్ ప్రమోషనల్ స్టైల్ కారణంగానే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. కానీ అదే ఆయన్ను ట్రోల్స్ టార్గెట్‌గా మార్చేసింది.
కానీ ఇప్పుడు నాగ వంశి క్లారిటీ ఇచ్చేశారు: “War 2 ఫ్లాప్ అయినా… నేనిక్కడే ఉంటా… కనీసం ఇంకో 15 ఏళ్లు… సినిమాల కోసం, ఎల్లప్పుడూ!”