సినిమా వార్తలు

₹600 కోట్ల కేసు షాక్ – శిల్పా శెట్టి బాస్టియన్ బాంద్రా క్లోజ్!

బాలీవుడ్ స్టార్ శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా జంట మళ్లీ హెడ్లైన్స్‌లోకి వచ్చేశారు. కారణం మాత్రం వారికే ఇష్టంలేని ఒక పెద్ద వివాదం. మీడియా రిపోర్ట్స్ ప్రకారం, గత దశాబ్ద కాలంగా సాగుతున్న ₹600 కోట్ల లోన్-ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కేసులో ఈ జంటపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో, శిల్పా షెట్టి ముంబై ఫుడీస్‌కి షాక్ ఇచ్చే మరో అప్‌డేట్ ఇచ్చింది. బాలీవుడ్ సెలబ్రిటీలకు, పార్టీ హబ్‌కి హాట్‌స్పాట్‌గా నిలిచిన బాస్టియన్ బాంద్రా రెస్టారెంట్ ఇక మూతపడనుంది!

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ షేర్ చేసిన శిల్పా –

“ఈ గురువారం ముంబై నైట్‌లైఫ్‌ని మలిచిన ఒక చాప్టర్ ముగుస్తోంది. ఇక్కడ countless మెమరీస్, unforgettable nights, iconic moments క్రియేట్ అయ్యాయి” అంటూ తెలిపింది.

కానీ ఇది నిశ్శబ్దంగా ముగిసేది కాదు. చివరి రాత్రి nostalgia & celeb-party vibeతో బాస్టియన్ డోర్స్ క్లోజ్ అవుతాయి.

అయితే బ్రాండ్ పూర్తిగా క్లోజ్ అవ్వడం లేదు.

Arcane Affair పార్టీలు ఇప్పుడు “Bastian at The Top”లో కొనసాగుతాయని శిల్పా క్లారిటీ ఇచ్చింది.

అయినా, బాంద్రా బాస్టియన్‌నే తమ playgroundగా భావించిన వారికి ఇది ఒక ఎరా ముగిసినట్టే! ముంబై లైఫ్‌స్టైల్‌లో అత్యంత ఐకానిక్ ల్యాండ్‌మార్క్ కూడా ఇలాగే డ్రామాటిక్‌గా క్లోజ్ అవ్వడం షాకింగ్.

Similar Posts