ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు ఒకప్పుడు నిర్మాతలకు వరమని అనిపించేవి. థియేటర్లలో రిస్క్ తీసుకున్నా, ఓటిటి రైట్స్‌తో బడ్జెట్‌కి సేఫ్‌జోన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ బిజినెస్ మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయింది. పెద్ద పెద్ద ప్లాట్‌ఫారమ్‌లు తెలుగు సినిమాల డిజిటల్ హక్కుల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. దీంతో నిర్మాతలు, స్టార్ హీరోల సినిమాలే అయినా కూడా ఓటిటి డీల్ కోసం కష్టపడుతున్న దుస్థితి కనిపిస్తోంది.

UV క్రియేషన్స్ తాజా షాక్

ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా వెలుగొందిన UV క్రియేషన్స్ వరుస ఫ్లాప్స్‌తో గట్టిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. సాహో, రాధేశ్యామ్ లాంటి ప్రాజెక్టులు ఊహించని నష్టాలు తెచ్చిపెట్టాయి. ఇంతలో మిస్ షెట్టి మిస్టర్ పోలిషెట్టి ఒక్కటే లాభాన్ని చూపించింది. ఇప్పుడు చిరంజీవి హీరోగా వస్తున్న భారీ చిత్రం విశ్వంభరపై వారి భవిష్యత్తే ఆధారపడి ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ 2026కి వాయిదా పడటంతో, కొత్త ప్రాజెక్టులన్నీ హోల్డ్‌లో పెట్టేశారు.

వరుణ్ తేజ్ – కొరియన్ కనకరాజు సమస్య

ఇదే సమయంలో UV క్రియేషన్స్, వరుణ్ తేజ్ హీరోగా కొరియన్ కనకరాజు అనే చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్నారు. రాజీవ్ రెడ్డి సహ నిర్మాతగా ఉన్న ఈ చిత్రానికి బడ్జెట్ రికవరీ కోసం ఓటిటి డీల్ క్లోజ్ చేయాలని నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ షాక్ ఏమిటంటే… అమేజాన్ , నెట్ ప్లిక్స్, జీ 5 వంటి పెద్ద పెద్ద డిజిటల్ సంస్థలు ఆసక్తి చూపడం లేదని వినికిడి. కంటెంట్, టీజర్ వచ్చాకా నిర్ణయం తీసుకుంటామని చెప్పి , ప్రస్తుతానికి డీల్‌కు పెద్ద నో చెప్పేశాయి.

ఇప్పటి పరిస్థితుల్లో స్టార్ హీరో సినిమాలకే ఇలాంటి ఇబ్బందులు వస్తే, చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? ఓటిటి బిజినెస్‌నే ఎక్కువగా నమ్ముకున్న నిర్మాతలు కొత్త గణాంకాలు చూసి షాక్ అవుతున్నారు. కొరియన్ కనకరాజు ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఆ తరువాత డిజిటల్ రైట్స్ పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.

ఇక వరుస పరాజయాల్లో ఉన్న వరుణ్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మట్కా దారుణంగా నిరాశపరచడంతో చిన్న గ్యాప్ తీసుకున్నాడు. విభిన్న కథలంటే ఇష్టపడే వరుణ్.. మేర్లపాక గాంధీ చెప్పిన స్టోరీకి ఫిదా అయిపోయి ఒకే చెప్పాడట. మెగా ప్రిన్స్ 15వ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇక వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ కూడా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. దీంతో వీరిద్దరి కలయిలో వచ్చే మూవీ కచ్చితంగా హిట్టు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

, , , , , ,
You may also like
Latest Posts from