ప్యాన్ ఇండియా మార్కెట్ ని దాటిన మన హీరోలకు జపాన్ మార్కెట్ మాత్రం ఇప్పుడు సవాలుగా మారింది. ఇప్పటికే ప్రభాస్ కి జపాన్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.. రీసెంట్ గా RRR తో రామ్ చరణ్, తారక్ లకు కూడా మంచి క్రేజ్ ఏర్పడింది జపాన్ లో. అం RRR, ఏడాది పాటు జపాన్ లో ఆడటమే కాకుండా బయట దేశాల నుండి రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే అత్యధిక వసూళ్లు రాబట్టి జపాన్ లో రికార్డు క్రియేట్ చేసింది.

ఈ క్రమంలో ఈ ఇద్దరి హీరోలు సెపరేట్ గా రిలీజ్ చేసిన సోలో సినిమాలను సైతం అక్కడ భారీగా రిలీజ్ చేస్తున్నారు. అయితే అక్కడ మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ విషయంలో రామ్ చరణ్ కంటే చాలా వెనకబడ్డాడు అనే అంటోంది ట్రేడ్.

RRR తర్వాత రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే జపాన్ లో అల్ టైం రికార్డు సెట్ చేసింది. KGF 1,2 జపాన్ రిలీజ్లతో పోటీ గా రంగస్థలం రిలీజ్ అయినప్పటికీ 2.5 మిలియన్ జపాన్ యిన్స్ వసూళ్లు సాదించి రికార్డు సెట్ చేసింది.

RRR తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన దేవర విషయానికి వస్తే కలెక్షన్స్ దారుణంగా ఉంది. జపాన్ లో నెల రోజుల ముందు నుండే దేవరను ప్రమోట్ చేస్తున్నా సరే సినిమా జపాన్ ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది.

జపాన్ లో లక్ పరీక్షించుకున్న దేవరకు నిరాశే మిగిలింది. మొత్తం మీద 1.2 మిలియన్ జపాన్ యెన్స్ మాత్రమే దేవర అందుకున్నట్టుగా అక్కడి రిపోర్ట్స్ తెలుపుతున్నాయి.

, , , ,
You may also like
Latest Posts from