
గతేడాది ‘క’ తో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి ఎంటరైన కిరణ్ అబ్బవరం… ఈ ఏడాది ‘దిల్ రుబా’ తో మాత్రం గట్టిగా కిందపడ్డాడు. కానీ వెనుకడుగు వేసే హీరో కాదు ఆయన. వరుసగా కొత్త సినిమాలతో మళ్లీ రేసులోకి వచ్చేశాడు. వాటిల్లో హాట్ టాపిక్ అవుతున్నది ‘K-ర్యాంప్’ .
డెబ్యూ డైరెక్టర్ జైన్స్ నాని తెరకెక్కిస్తున్న ఈ సినిమా… టీజర్ రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో హంగామా మామూలుగా లేదు. ఎందుకంటే? ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్‌లో బూతులు, డబుల్ మీనింగ్ పంచ్‌లు, లిప్‌లాక్స్, రొమాంటిక్ సీన్స్ తో యూత్‌ని షేక్ చేసే ప్రయత్నం చేసాడు కిరణ్!
హీరోయిన్‌గా యుక్తి తరేజా గ్లామర్ డోస్ అందిస్తుండగా… నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ లాంటి సీనియర్–కామెడీ కాంబో ఈ ప్రాజెక్ట్‌కు బలాన్నిస్తున్నారు.
హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై రూపొందుతున్న K-ర్యాంప్ ఈ దీపావళికి, అక్టోబర్ 18న థియేటర్లలోకి రానుంది.
ఇప్పటివరకూ కిరణ్ చేసిన సినిమాల కంటే ఇది బోల్డ్ & వైల్డ్ గా ఉందన్నది టీజర్ చూస్తే క్లియర్ . అసలేంటి? ఈసారి కిరణ్ అబ్బవరం యూత్ మైండ్ టార్గెట్ చేశాడా? లేక ఇందులో దాగి ఉన్న మరో మాస్ ట్విస్ట్ ఉందా?
మొత్తానికి టీజర్ క్లియర్ గా చెప్పిన మెసేజ్ ఏమిటంటే:
“ఈసారి కిరణ్ అబ్బవరం – యూత్ కోసం రెడీ… రెస్ట్ ఆఫ్ ఆడియన్స్ షాకవ్వాల్సిందే!”
