
శ్రీలీల కెరీర్ ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో… !”
పెళ్లి సందడి, ధమాకా వంటి వరుస హిట్స్‌తో టాలీవుడ్‌లో స్టార్ హోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల… ఒక్కసారిగా డజన్ల కొద్దీ సినిమాలు సైన్ చేసి అన్ని క్యాలెండర్లలో ఫుల్‌బిజీ అయ్యింది. కానీ, ఆ స్పీడ్ ఆమెకే శాపంగా మారిందా? అనిపించేలా, ఇటీవల వరుసగా ఫ్లాప్స్ ఆమెను బిగ్ సెట్ బ్యాక్‌కు గురిచేశాయి.
ఈ ఏడాదిలోనే జూనియర్, రాబిన్‌హుడ్, మాస్ జాతర – మూడు భారీ డిజాస్టర్స్! కేవలం కలెక్షన్స్ మాత్రమే కాదు… ఈ సినిమాల్లో ఆమెకు నటించడానికి సరైన స్కోప్ కూడా రాలేదు. ఫలితంగా, టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన శ్రీలీల ఇప్పుడు టఫ్ ఫేస్ చూస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా చాలా తక్కువ.
ఇలాంటి దశలో, టాలీవుడ్ బాక్స్ మాత్రమే సరిపోదని అర్థం చేసుకున్న శ్రీలీల… పాన్ ఇండియా స్టెప్ వేసేసింది. ఇప్పుడు ఆమె దృష్టి తెలుగు దాటి కోలీవుడ్, బాలీవుడ్ మీద!
కోలీవుడ్ భారీ ఎంట్రీ – ‘పరాశక్తి’
శివకార్తికేయన్ హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా… శ్రీలీల కెరీర్‌లో డెఫినెట్‌గా గేమ్‌చేంజర్ అంటున్నారు మూవీ సర్కిల్స్. సుధా కొంగర చేసిన ఫిమేల్ లీడ్స్‌కి అంతగా పాత్ర ప్రాధాన్యం ఉంటుంది – కాబట్టి ఇది ఆమెకు గోల్డెన్ ఛాన్స్.
బాలీవుడ్‌లో రొమాంటిక్ డ్రామా
అనురాగ్ బసు దర్శకత్వంలో, కార్తిక్ ఆర్యన్ సరసన బాలీవుడ్ ఎంట్రీ. హిందీ మార్కెట్ లో బలమైన లాంచ్ అయితే… శ్రీలీల స్టార్ ఇమేజ్ మరింత పెరగొచ్చు.
ఇప్పుడు పరిస్థితి ఒకటే —
ఈ రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్స్ అయితే శ్రీలీల పాన్–ఇండియా స్టార్ అవ్వడం ఖాయం! లేకపోతే టాలీవుడ్‌లో వచ్చిన ప్రెషర్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
ఇంతకీ …
“శ్రీలీల తిరిగి రైజ్ అవుతుందా… లేక స్టార్ మార్కెట్ అక్కడే ఆగిపోతుందా?”
వేడుకగా ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ & కోలీవుడ్ ఆడియన్స్!
