పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. ఈ నెల 19న విజయవాడలో, 21న హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ జరగనున్నాయి. హైదరాబాద్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని టాక్. ఇది నిజమైతే మెగా అభిమానులకు డబుల్ ఫెస్టివల్ అవుతుంది.

తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు రిలీజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల పవన్ బర్త్‌డే సందర్బంగా విడుదల చేసిన గ్లింప్స్ అంచనాలను మరింత పెంచేశాయి. దసరా కానుకగా ఈ నెల 25న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్‌లో బుకింగ్స్ ప్రారంభం కాగా రికార్డు స్థాయిలో టిక్కెట్లు సేల్ అవుతున్నాయి. నార్త్ అమెరికాలో అప్పుడే లక్షల సంఖ్యలో టిక్కెట్లు అమ్ముడుపోయాయంటేనే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఇప్పటికే రికార్డులు బద్దలయ్యాయి. రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ కూడా ఫ్యాన్స్‌ని ఇంప్రెస్ చేస్తూ హైప్ పెంచేసింది. కానీ ట్రైలర్ డేట్ ఇంకా మేకర్స్ రివీల్ చేయలేదు.

ఇన్‌సైడ్ టాక్ ఏమంటుందంటే — రిలీజ్‌కు వారం ముందు భారీ ఈవెంట్‌లో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారట. కానీ ట్రైలర్‌ను ఇప్పుడే రిలీజ్ చేసి రెండు వారాల హంగామా క్రియేట్ చేస్తే మరింత హైప్ పెంచే అవకాశం ఉండేది అంటున్నారు సినీ వర్గాలు.

పవన్ కల్యాణ్ మాత్రం సినిమా ప్రమోషన్స్‌కు మూడురోజులు సమయం కేటాయిస్తానని క్లియర్‌గా చెప్పేశాడు. దానికి తగ్గట్టే ప్రమోషనల్ ప్లాన్ రెడీ అవుతోంది. గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రెండూ కలిసి ప్లాన్ చేస్తున్నారు. అయితే పవన్ రెండింటికీ హాజరవుతాడా? లేక మీడియా ఇంటరాక్షన్స్, ఇంటర్వ్యూలకే టైమ్ ఇస్తాడా? అనేది సస్పెన్స్‌గానే ఉంది.

అంతేకాదు, O.G బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో ముగిసింది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ డీల్స్ అన్నీ హయ్యెస్ట్ ప్రైజ్‌కే క్లోజ్ అయ్యాయి. సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మ్యాసివ్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 25న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. DVV దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా సంగీతం థమన్ అందిస్తున్నాడు.

అసలు పవన్ ఎలాంటి ప్రమోషనల్ ప్లాన్‌తో వస్తాడో? ట్రైలర్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ అవుతుందో? ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు!

, , , , ,
You may also like
Latest Posts from