సినిమా గాసిప్స్సినిమా వార్తలు

మహేష్ బాబు రాముడా? హనుమంతుడా? రాజమౌళి కధలో మైథాలాజికల్ ట్విస్ట్!

ఇప్పుడందరి దృష్టీ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ ప్రాజెక్ట్ SSMB29 పైనే. ఈ ప్రాజెక్టు ఆ బజన్ పెంచే విధంగా , రోజుకో రకమైన సర్ప్రైజ్ ఇస్తోంది. మరో ప్రక్క ఈ నెల 15న విడుదల కాబోయే గ్లింప్స్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో 100 అడుగుల ఎత్తైన స్క్రీన్ సిద్ధమవుతుండటంతో ఈ ఈవెంట్ రేంజ్ ఊహించండి! ఆ స్క్రీన్‌పైనే — ఇండియా ఎదురుచూస్తున్న గ్లింప్స్ ఆఫ్ SSMB29 ప్రదర్శించబోతోంది.

విలన్ లుక్‌తో షాక్ – “కుంభ” ఎంట్రీతో పౌరాణిక థియరీ బలపడింది!

కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ చుట్టూ హడావుడి జరుగుతోంది. ఆయన పాత్ర పేరు “కుంభ” అని బయటపడడంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.

పాత సినిమాల్లోని రాక్షస లుక్స్‌తో పోలికలు, మీమ్స్ వచ్చినా — అసలు టాక్ మాత్రం వేరే దిశగా వెళ్తోంది. రాజమౌళి రామాయణం ఆధారంగా ఈ కథను డిజైన్ చేశారా? అనే ప్రశ్న ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

“కుంభ” అంటే ఎవరు? రామాయణ లింక్ ఇదే!

రామాయణంలో “కుంభుడు” అనే పాత్ర ఉంది — అతను కుంభకర్ణుడి కుమారుడు, రాక్షస జాతికి చెందిన యోధుడు. రామ–రావణ యుద్ధంలో పాల్గొన్న ఈ పాత్రను రాముడు లేదా హనుమంతుడు కాదు… సుగ్రీవుడు హతమార్చాడు. ఇదే పాయింట్ ఇప్పుడు ఫ్యాన్స్ ఊహల్లో బాంబులా పేలుతోంది.

మరి సినిమాలో ఆ సుగ్రీవుడి పాత్ర ఎవరు పోషిస్తారు?, మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారా? లేక హనుమంతుడి స్పిరిట్‌గా? ఇవే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చల తుఫానుగా మారాయి.

ప్రియాంకా చోప్రా, మాధవన్ ల పాత్రలపై సీక్రెట్ బజ్

ప్రియాంకా చోప్రా ఏ దేవత రిఫరెన్స్ ఆధారంగా పాత్ర పోషిస్తున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతోంది. మాధవన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తారని టాక్ ఉంది — ఆయన పాత్ర కూడా పౌరాణిక కాన్సెప్ట్‌తో లింక్ అయి ఉండొచ్చన్న జోస్యం బలపడుతోంది.

గ్లింప్స్‌లో క్లూ దాగి ఉందా?

మహేష్ బాబు షూట్ చేసిన కొన్ని సీన్స్ డివైన్ ఫ్రేమ్ లో ఉన్నాయన్న సమాచారం ఉంది. ఇది నిజమైతే, గ్లింప్స్ వీడియోలో రాముడి రూపానికి సంబంధించిన క్లూ ఇవ్వొచ్చని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఫ్యాన్స్ క్విక్ థియరీ:

కుంభుడు విలన్‌గా వస్తే… రాముడి రిఫరెన్స్ కన్‌ఫర్మ్!, హనుమంతుడి ఎనర్జీ ఉంటే… యాక్షన్ గాడ్ లెవెల్! సుగ్రీవుడి పాత్ర ఎవరో తెలిసే వరకు హైప్ కొనసాగుతుంది!

Similar Posts