సినిమా వార్తలు

విజయ్ ‘జన నాయకన్’ షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్!

దళపతి విజయ్ అంటేనే బాక్స్ ఆఫీస్ గ్యారంటీ! ఆయన ఉంటే చాలు. డైరెక్టర్ స్టార్ కానక్కర్లేదు. అలాగే కంటెంట్ మాస్ లెవెల్‌లో ఉండకపోయినా – విజయ్ పేరే చాలు అని మళ్లీ రుజువు చేసింది ‘జన నాయకన్’.

హెచ్ . వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ పొలిటికల్ డ్రామా జనవరి 9, 2026న పొంగల్ సందర్భంగా విడుదల కానుంది. రిలీజ్ ముందే సినిమా చేసిన థియేట్రికల్, నాన్-థియేట్రికల్ బిజినెస్ చూసి ఇండస్ట్రీ షాక్ అయ్యింది!

రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్ డీటైల్స్:

అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ రైట్స్ – ₹110 కోట్లు

ఫార్స్ ఫిలిమ్స్ ఓవర్సీస్ రైట్స్ – ₹75 కోట్లు

రోమియో పిక్చర్స్ తమిళనాడు రైట్స్ – ₹100 కోట్లు

కేరళ రైట్స్ – ₹15 కోట్లు

ఆడియో రైట్స్ కలిపి ఇప్పటికే ప్రీ-బిజినెస్ ₹300 కోట్ల మార్క్ దాటేసింది. మిగతా కర్ణాటక, ఉత్తర భారత, తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ & సాటిలైట్ రైట్స్ కలిపితే, మొత్తం ₹400 కోట్ల దాకా బిజినెస్!

దళపతి స్టార్డమ్ మళ్లీ నిరూపితమైంది!

‘The GOAT’ తర్వాత మరోసారి తళపతి విజయ్ తన మార్కెట్ శక్తిని చూపించాడు. స్టార్ డైరెక్టర్ లేకపోయినా – బ్రాండ్ “తళపతి” పేరు వింటేనే డిస్ట్రిబ్యూటర్లు క్యూ లో నిలబడుతున్నారు.

పొంగల్ ఫెస్టివల్‌లో ‘జన నాయకన్’ బాక్స్ ఆఫీస్ రచ్చ చేయబోతోందని హింట్ వచ్చేసింది ఈ బిజినెస్ తో !

Similar Posts