వీడియోలుసినిమా వార్తలు

భర్తలందరికీ విజ్ఞప్తి – రవితేజ కొత్త కామెడీ వెనుక మేటరేంటి? !!

మాస్ మహారాజ్‌ రవితేజ ఇప్పుడు కొత్త మూడ్‌లో ఉన్నారు! వరుస ఫ్లాప్స్ తర్వాత ఆయన మళ్లీ తనకు నచ్చిన జానర్‌ — కామెడీ, ఎమోషన్ మిక్స్ అయిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో తిరిగి వస్తున్నారు. ఈసారి కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో, రవితేజ “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే పర్‌ఫెక్ట్‌గా క్యాచీ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

RT76 – ఒక కొత్త రవితేజ!

SLV సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి జీ స్టూడియోస్ ప్రెజెంటింగ్ పార్ట్నర్. ఇవాళ (నవంబర్ 10) విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌లోనే ఫ్యాన్స్‌కి సరదా దుమ్మే రేపింది! టెంపుల్ అనౌన్స్‌మెంట్ స్టైల్‌లో మొదలైన వీడియోలో, కిషోర్ తిరుమల వాయిస్‌ఓవర్‌తోనే ఫన్ ఆరంభమైపోతుంది. రవితేజ — ‘రామ సత్యనారాయణ’గా — తన జీవితంలోని ఇద్దరు మహిళలు వేసిన రెండు ప్రశ్నలతో తికమకపడిపోతాడు! చివర్లో చెప్పిన డైలాగ్ “ఇలాంటి ప్రశ్నలు ఎవ్వరూ ఎదుర్కోకూడదు” అన్న రవితేజ స్టైల్‌కి థియేటర్లలో వేవ్స్‌ గ్యారంటీ.

ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి

ఈసారి రవితేజ జీవితంలో ఈ ఇద్దరు గ్లామరస్ హీరోయిన్లు! వారి మధ్య ఉండే ఫన్, రొమాన్స్, ఎమోషన్ సీన్లు ఫ్రెష్‌గా, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.

భీమ్స్ బీట్‌లు – కిషోర్ హ్యూమర్!

భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, ప్రసాద్ మురెల్లా సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ — ఈ కాంబినేషన్‌కి హిట్ సౌండ్ ఖాయం అంటున్నారు యూనిట్ వర్గాలు.

మాస్ నుంచి ఫ్యామిలీకి మారిన రవితేజ!

మాస్ జాతర తరువాత వచ్చిన ఈ మూవీతో రవితేజ ఇమేజ్‌కి మళ్లీ రీసెట్ బటన్ నొక్కినట్టే. “భర్త మహాశయులకు విజ్ఞప్తి” టైటిల్ వినగానే ఫ్యాన్స్ ట్విట్టర్‌లో ఫన్ మీమ్స్, పాజిటివ్ బజ్‌తో ఊపేసారు.

సంక్రాంతి 2026 – భర్తలందరికీ విజ్ఞప్తి!

ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌ 2026 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వస్తోంది. ఈసారి అయినా రవితేజ మాస్ మహారాజ్ మార్క్ హిట్ కొడతాడా? లేక మళ్లీ ఆ “విజ్ఞప్తి” ప్రేక్షకులకా?

Similar Posts