సినిమా వార్తలు

హీరోగా లోకేష్ కనగరాజ్.. రెమ్యునరేషన్‌లో కొత్త రికార్డ్!

ప్రఖ్యాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరో అవుతున్న సంగతి తెలిసిందే. అరణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘DC’ సినిమాలో లోకేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

ఇక తాజా సమాచారం ప్రకారం — లోకేష్ ఈ సినిమాకి సుమారు ₹35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. అది కేవలం నటనకే కాదు, కథకు ఆయన చేసిన సహకారం కారణంగానూ అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు “లోకేష్ డైరెక్టర్‌గా 50 కోట్లు తీసుకున్నాడు, కాబట్టి హీరోగా 35 కోట్లు కూడా తక్కువే” అంటుంటే, మరికొందరు మాత్రం “DC ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల లెవెల్‌లో ఉండదు, అలాంటప్పుడు ఇంత భారీ పే ఎక్కడి నుండి?” అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇక ఈ రెమ్యూనరేషన్ వలన సినిమా బడ్జెట్ పెరిగి, నిర్మాతలకు రిస్క్ అవుతుందనే కామెంట్లు కూడా వచ్చాయి.

మొత్తానికి, ‘DC’ సినిమా ఇంకా షూటింగ్‌లోనే ఉన్నా, లోకేష్ రెమ్యూనరేషన్‌ గాసిప్‌తో సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతోంది. అయితే ఈ వార్తలపై లోకేష్ గానీ, చిత్రబృందం గానీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు.

Similar Posts