
నితిన్ కమ్బ్యాక్ ప్లాన్! క్లిక్ అయితే ఓకే, తేడా కొడితే ఇక అంతే
రాబిన్‌హుడ్… తమ్ముడు — రెండు భారీ బడ్జెట్ మూవీస్ వరుసగా బాక్సాఫీస్ వద్ద కూలిపోవడంతో నితిన్ కెరీర్ అనూహ్యంగా డేంజర్ జోన్‌లోకి వెళ్లిపోయింది. భారీ పెట్టుబడులు, భారీ అంచనాలు, ఆశల మధ్య వచ్చిన ఈ ఫెయిల్యూర్స్ హీరోకు భారీ షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం నితిన్ పూర్తిగా బ్రేక్ తీసుకుని, “కమ్బ్యాక్ ఎలా ఉండాలి?” అన్న ప్లాన్ మీదే ఫోకస్ చేస్తుండటం ఇండస్ట్రీలో బిగ్ టాక్.
ఇదిగో గుడ్ న్యూస్ – నితిన్ ‘Ishq 2’ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట!
రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను మళ్లీ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన Ishq ఇప్పటికీ బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్‌లో ఉంటుందంటే అంత పాపులర్. ఇప్పుడు అదే బ్రాండ్‌తో ‘Ishq 2’ అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ వైట్‌గా ఎదురు చూస్తున్నారు. ఫైనల్ డిస్కషన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా చాలా త్వరలో అధికారికంగా ప్రకటించబడుతుంది.
అనూప్ రూబెన్స్ రీ-ఎంట్రీ!
‘Ishq’ కి మ్యాజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ మళ్లీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందించనున్నాడు. ఇది కూడా ప్రాజెక్ట్ మీద హైప్ రెట్టింపు చేస్తోంది.
ఇకపోతే, నితిన్ చాలా కాలంగా లైన్‌లో పెట్టుకున్న యల్లమ్మ (బలగం వేణు) ప్రాజెక్ట్ మాత్రం చేతులు మారింది. అలాగే 70MM ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఓ కొత్త సినిమా కోసం కూడా నితిన్ చర్చల్లో ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
వరుస ఫెయిల్యూర్స్ నుంచి బయటపడడానికి ‘Ishq 2’ నితిన్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా?
అన్న ప్రశ్నతో ఫ్యాన్స్, ట్రేడ్ సర్కిల్స్ ప్రస్తుతం పూర్తిగా వేచి చూస్తున్నాయి.
