సినిమా వార్తలుసినిమా సమీక్షలు

రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా రివ్యూ

ఆంధ్రా సూపర్‌స్టార్ సూర్య (ఉపేంద్ర) కి తన వందో సినిమా సమయంలో ఓ సమస్య వస్తుంది. ఆర్దిక సమస్యలతో సినిమా ఆగిపోతుంది. దాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలని విశ్వప్రయత్నం చేస్తాడు. కానీ తన వల్ల కాదు. ఇంక చేతులెత్తేసాను అనుకున్న సమయంలో తన ఎక్కౌంట్ లో ఆ సినిమా తిరిగి ప్రారంభమైన పూర్తికావటానికి కావాల్సిన మూడు కోట్లు జమ అవుతాయి. ఆశ్చర్యపోయిన సూర్య ఎవరు ఈ పని చేసారని ఎక్వైరీ చేస్తే తన వీరాభిమాని గోదావరి జిల్లా వాసి సాగర్ (రామ్ పోతినేని)అని తెలుస్తోంది. దాంతో అతన్ని స్వయంగా కలవాలని బయిలుదేరతాడు. ఈ క్రమంలో సాగర్ గురించిన జీవిత విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. మహాలక్ష్మి (భాగ్యలక్ష్మి బోర్సే) తో అతని ప్రేమ కథ ఏమిటి..ఆమె తండ్రి పురుషోత్తం (మురళీ శర్మ)తో చేసిన ఛాలెంజ్ ఏమిటి , వాటిన్నటి వెనకా తను హీరోగా తన సినిమాలతో చూపిన ప్రభావం తెలుసుకుంటాడు. అప్పుడు ఏమైంది…సాగర్ జీవితం చివరకు ఎలాంటి టర్న్ తీసుకుంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్

ఒక అమ్మాయి ప్రేమ కోసం… ఒక హీరో గౌరవం కోసం… మనిషి ఎంత దూరం వెళ్లగలడు? ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసారు దర్శకుడు. సినిమా మొదటి ఫ్రేమ్ నుంచే డైరెక్టర్ మనలను సాగర్ ప్రపంచంలోకి నేరుగా తీసుకువెళ్తాడు. ఇది రామ్ చేసిన రెగ్యులర్ ఎనర్జిటిక్ సినిమా కాదు— ఈసారి మనం చూస్తుందేమిటంటే, ఒక అభిమాని అమాయక ప్రపంచం, అతని ప్రేమ, అతని తపన.

ఇందులో రామ్ ఒక అమ్మాయిని ప్రేమించే కుర్రాడు… అదే సమయంలో తన ప్రాణం పెట్టే స్టార్ హీరో కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే అభిమాని. ఇవి రెండు ట్రాక్స్ ఒకదానిలోకి ఇంకొకటి ఎలా కలుస్తాయి? అదే ఈ సినిమా అసలు బలం. ఇది కేవలం సినిమా–ఫ్యాన్ మైథాలజీ కాదు. ఒక రేర్-ఎమోషనల్ బ్యాక్‌స్టోరీ గా చూపాలనుకున్నాడు. RAPO కూడా తన స్టైల్‌ని పక్కన పెట్టి, నిజాయితీతో కథ చెప్పిన అరుదైన ప్రయత్నం. కానీ… అందుకు తగ్గ స్క్రిప్టుని లేకపోవటంతో ఆ స్దాయి డెప్త్ మిస్సైంది.

కొన్ని మైనస్ పాయింట్లు స్పష్టంగా కనిపిస్తాయి: మొదటి 30–40 నిమిషాల పేస్ చాలా స్లో, ఎడిటింగ్ షార్ప్‌గా ఉంటే సినిమా మరింత బలంగా ఉండేది, కొన్ని సీన్లు అనవసరంగా లెంగ్త్ పెంచుతాయి, VFX కొన్ని చోట్ల లో బడ్జెట్ లో లాగేసినట్లు అనిపిస్తుంది. స్లో డ్రామా కారణంగా కాంఫ్లిక్ట్ ఆశించినంతగా ప్రెషర్ ఇవ్వదు. సెకండాఫ్ లో రొటీన్ సీన్స్ ఎక్కువ పడి ఇబ్బంది పెడతాయి. అలాగని సినిమా లో మంచి సీన్స్ లేవు..మంచి డైలాగులు లేవు అని కాదు. అవన్నీ కథ,కథనంలో కొట్టుకుపోయాయి.

నిజానికి ఓ స్టార్‌హీరో పతనం, అజ్ఞాత అభిమాని త్యాగం, చిన్న గ్రామ జీవితం… ఇలాంటి మూడు లేయర్లు కలుపుతూ , ఒక ఎమోషనల్ హ్యూమన్ డ్రామా తో కథ చేయటం అంటే కష్టమే. డైరక్టర్ సినిమా మొత్తం అదే ఐడియాతో రాసుకున్నా.. దాన్ని సమర్దవంతగా ముందుకు తీసుకెళ్లే ట్రీట్మెంట్ మాత్రం అందుకు తగ్గట్లు స్ట్రాంగ్ గా సెట్ అవ్వలేదు లేదు. అలాగే సాగర్ ఎందుకు “అంత” పెద్ద అభిమాని అయ్యాడు? ఆ లోతైన బాధ, ఆ మనసు గాయం — స్క్రీన్ పై పూర్తిగా మోడలైజ్ కాలేదు. ఇక్కడే ఫిల్మ్ మొదటి బిగ్ మిస్.

ఎవరెలా చేసారంటే..

రామ్‌ పూర్తి నటుడిగా కనిపించాడు; ఎమోషన్, నత్తి సీన్లు, లవ్‌ట్రాక్ — అన్ని చోట్ల బెస్ట్ ఇచ్చాడు, కానీ యాక్షన్ మిస్‌ ఫీలవుతుంది. ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ పర్ఫెక్ట్; భాగ్యశ్రీ అందంగా చేసింది కానీ స్కోప్ తక్కువ. సత్య కామెడీ ఒక్కటే పక్కా రిలీఫ్.

టెక్నికల్ గా ..

మ్యూజిక్‌, బీజీఎం, కెమెరా వర్క్ సినిమా హైలైట్స్; కానీ ఎడిటింగ్ చాలా స్లోగా ఉండటం వల్ల నేరేషన్ బరువెక్కింది. డైరెక్టర్ ఎంచుకున్న సబ్జెక్ట్ ఎమోషన్‌గా పనిచేసినా, కామన్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా బాండింగ్, ఫన్, కమర్షియల్ మిక్స్ బలంగా రాలేదు.

చూడచ్చా

ఒక మంచి కథ… మంచి నటనలు… కానీ ఇంకా మెరవాల్సిన ఎమోషనల్ కోర్. Story-driven films ఇష్టపడేవారికి ఒకసారి చూడదగ్గ honest attempt.

Similar Posts