
ప్చ్ …జంప్ వస్తుందనుకునుకుంటే… డ్రాప్ వచ్చేసింది!
రామ్ పొతినేని తాజా చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా ఇండియాలో మొదటి రోజు ఆశించినంత ఓపెనింగ్‌ను అందుకోలేదు. జానర్ నేచర్, గురువారం రిలీజ్ కలిసి బాక్సాఫీస్‌పై ప్రభావం చూపాయి. కానీ రివ్యూలు పాజిటివ్‌గా రావడంతో —“డే 2 దూసుకు పోతుంది!” అని అందరూ భావించారు.
కానీ జరిగింది దానికి సరితూగేది కాదు… డే 2లో జంప్ రావాల్సింది… కానీ డే 1తో పోలిస్తే డ్రాప్ నమోదు! తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొదటి రోజు కేవలం 4 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఓవర్సీస్ మాత్రం బాగానే వచ్చింది. మొత్తం కలిపి వరల్డ్‌వైడ్ డే 1 గ్రాస్ 7 కోట్ల కాస్త ఎక్కువే.
పాజిటివ్ WOM ఉండడంతో, మేకర్స్, ట్రేడ్ — అందరూ “డే 2లో బౌన్స్ రావాలి” అనుకున్నారు. కానీ షాకింగ్‌గా… డే 2లో జంప్ కాదు, లైట్ డ్రాప్! ఇది సినిమాకి పూర్తి మంచి సైన్ కాదు. అయితే ఓ మంచి విషయం — సెకండ్ షో నుంచి ఆక్యుపెన్సీ స్ట్రాంగ్‌గా పెరిగింది.
ఇప్పుడు AKTకి అత్యవసరం — డే 3 కంటే ఎక్కువ వసూళ్లు… డే 4 బిగ్ బ్లాస్ట్! సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్‌వైడ్ 50Cr గ్రాస్ అవసరం. అంటే: వీకెండ్ మొదటి 3 రోజుల్లో కనీసం 35Cr వరకు వెళ్లాలి. ఎందుకంటే వచ్చే వారం Akhanda 2 రిలీజ్ — అప్పుడికి AKTకి రన్ చాలా కష్టం అవుతుంది.
మొత్తం మీద
“కామెంట్స్ హై… కలెక్షన్స్ లో!” అనే పరిస్థితి ఆంధ్రా కింగ్ తాలూకాకి కనిపిస్తోంది. ఈ రోజు, రేపు వసూళ్లు సినిమా రేంజ్‌ను డిసైడ్ చేయనున్నాయి.
