
“ఆంధ్ర కింగ్ తాలూకా” ఫస్ట్ వీక్ వసూళ్లు ఇంత దారుణమా? రామ్‌కు ఇదేం పరిస్థితి!
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కొత్తగా ప్రయత్నించిన పీరియాడిక్-ఎమోషనల్ ఎంటర్‌టైనర్ “ఆంధ్ర కింగ్ తాలూకా”. ఈ చిత్రం నవంబర్ చివరి వారం విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు వివేక్–మెర్విన్ సంగీతం అందించారు.
పాటలు, టీజర్, ట్రైలర్— అన్నీ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సోషల్ మీడియాలో కూడా సినిమా మీద డీసెంట్ ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అయితే జరిగిందేమిటంటే…
డిసెంట్ టాక్ వచ్చినా… ఓపెనింగ్స్ మాత్రం ‘ఎక్స్‌పెక్టేషన్‌కి తగ్గట్టు’ లేవు!
ఫస్ట్ షో నుంచే రివ్యూలు బాగానే వచ్చాయి. “రామ్ డిఫరెంట్‌గా చేశాడు, ఎమోషన్ బాగుంది, పీరియడ్ లుక్ బాగుంది” అని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ, వసూళ్ల విషయంలో మాత్రం సినిమా నెక్ట్స్ లెవిల్ కు వెళ్లలేకపోయింది.
Day 1: సో-సో కలెక్షన్స్
Day 2, 3: పెరుగుదల లేదు
Day 4: అదే ఫ్లో, ఎలాంటి జంప్ లేదు
ఈ పరిస్థితి మేకర్స్‌కి రెడ్ సిగ్నల్ ఇచ్చినట్టే.
ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ – లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
నైజాం: ₹4.55 Cr
సీడెడ్: ₹0.57 Cr
ఆంధ్రా మొత్తం: ₹3.67 Cr
AP + TS టోటల్: ₹8.79 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా: ₹0.90 Cr
ఓవర్‌సీస్: ₹2 Cr
టోటల్ వరల్డ్‌వైడ్ షేర్: ₹11.69 కోట్లు
థియేట్రికల్ బిజినెస్ భారీగా – రికవరీ మాత్రం సగం కంటే తక్కువ!
“ఆంధ్ర కింగ్ తాలూకా”కు జరిగిన థియేట్రికల్ బిజినెస్:
₹25 కోట్లు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే: మినిమం ₹25.5 కోట్ల షేర్ అవసరం
కానీ ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి వచ్చిన షేర్:
₹11.69 కోట్లు మాత్రమే
అంటే ఇప్పటివరకు రికవరీ: 45% కూడా కాదు!
బ్రేక్ ఈవెన్ రావాలంటే సినిమా ఇంకా రాబట్టాల్సినది:
₹13.81 కోట్ల షేర్ కావాలి
ఈ వీక్‌డేస్‌లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ లేకపోతే… మేకర్స్‌కి నష్టం దాదాపు ఖాయమని ట్రేడ్ టాక్. అయితే పూర్తి డ్రాప్ కనపడుతోంది.
దాంతో “ఆంధ్ర కింగ్ తాలూకా” రామ్ కెరీర్‌లో మరో పెద్ద స్పీడ్ బ్రేకర్ అవుతుందనే చర్చ నడుస్తోంది.
