సినిమా వార్తలు

‘విలన్ బాధితురాలిగా నటిస్తోంది’ – సమంత పెళ్లిపై స్టైలిస్ట్ షాకింగ్ కామెంట్

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు – రాజ్ నిడిమోరు ఇటీవల కోయంబత్తూరు ఈషా యోగా సెంటర్‌లో భూత శుద్ధి వివాహం చేసుకున్న సంగతితెలిసిందే. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కాగా… అదే వేగంతో విమర్శలు, సంచలన వ్యాఖ్యలు కూడా మొదలయ్యాయి.

మాజీ మేకప్ స్టైలిస్ట్ సద్నా సింగ్ కౌంటర్ స్టోరీ: “బాధితురాలిగా… విలన్ బాగా నటించింది”

సమంతకు చాలా కాలం పర్సనల్ మేకప్ స్టైలిస్ట్‌గా పని చేసిన సద్నా సింగ్, పెళ్లి తర్వాత అకస్మాత్తుగా సమంతను అన్‌ఫాలో చేసి, ఓ క్రిప్టిక్, షాకింగ్ స్టోరీ పోస్ట్ చేసింది.

స్టోరీలో

“The villain plays the victim so well.”
(బాధితురాలిగా విలన్ చాలా బాగా నటించింది.)

ఈ ఒక్క లైన్‌తో సోషల్ మీడియాలో సునామీ వచ్చింది.

నెటిజన్ల ప్రశ్నలు:

“అంటే ఆమె సమంతనే విలన్ అంటోందా?”

“చై–సామ్ బ్రేకప్ వెనుక ఏదైనా నిజం బయట పెట్టిందా?”

“ఇద్దరి మధ్య నిజంగా ఏం జరిగింది?”

సద్నా సింగ్ రెండో స్టోరీతో మరింత చర్చ రేపింది:

“నిన్నటి నుంచి నా ఎగ్జాక్ట్ రియాక్షన్ ఇదే.”

అంటే… తను ఇక దీనిని పట్టించుకోట్లేదన్న సంకేతం.

సద్నా షేర్ చేసిన స్క్రీన్‌షాట్లలో ఆమెపై వ్యక్తిగత దూషణలు కనిపించడంతో, ఆమె కూడా ఇలా రాసింది:

“Educated frustrated living beings… brain frozen.”

ఈ మాటలు కూడా ట్రోల్స్‌ను మరింత రెచ్చగొట్టాయి.

పూనమ్ కౌర్ కూడా రంగంలోకి! “సొంత గూడు కట్టుకోవడానికి… మరొకరి ఇల్లు పడగొట్టడం బాధాకరం” .పూనమ్ కౌర్ చేసిన పోస్ట్ చర్చను ఇంకో లెవల్‌కి తీసుకెళ్లింది. ఈ వ్యాఖ్య నేరుగా సమంతకేనా? లేక ఎవరో వేరే వ్యక్తికా? నెటిజన్లు మాత్రం దానిని సమంత కొత్త పెళ్లిపైనే ఆ కామెంట్ చేసినట్లే భావిస్తున్నారు.

చై వీడియోలు మళ్లీ ట్రెండింగ్… సపోర్ట్ పోస్టులు వరుస!

సద్నా–పూనమ్ పోస్టుల కలయికతో సోషల్ మీడియా పూర్తిగా సమంత–చై బ్రేకప్ వైపు మళ్లిపోయింది.

ఇదే కారణంగా: నాగచైతన్య పాత ఇంటర్వ్యూలు, మోటివేషనల్ వీడియోలు, విడాకుల తర్వాత చేసిన కామెంట్లు అన్నీ మళ్లీ వైరల్ అవుతున్నాయి. చైత‌న్యకు సపోర్ట్ పోస్టులు పెరగడం కూడా గమనార్హం.. పెళ్లి హ్యాపీ న్యూస్ కంటే… డ్రామా నేక్స్ట్ లెవల్‌లో!

సమంత మాత్రం ఎలాంటి కామెంట్ చేయకుండా నిశ్శబ్దంగా ఉండడం, క్యూరియాసిటీని ఇంకా పెంచుతోంది.

Similar Posts