
దీపికా అవుట్… ప్రియాంక ఇన్? ప్రభాస్ సినిమా షాక్ టట్!
కల్కి 2898 AD సీక్వెల్ నుంచి దీపికా పదుకోని తప్పుకున్న తర్వాత ఫిల్మ్ నడుస్తున్న దిశ ఏమిటో అభిమానులకు అసలు అర్థం కావట్లేదు. ఎవరు రీప్లేస్ చేస్తారో అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఈ మధ్య వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం… ఆ రోల్ కోసం ప్రియాంకా చోప్రాతో చర్చలు జరుగుతున్నాయట. అంతేకాదు… దీపికా పాత్రను ఇంకా క్రూషియల్ పొజిషన్‌లో అప్‌గ్రేడ్ చేస్తారన్న టాక్ కూడా ఉంది!
ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ వంటి భారీ పేర్లు ఉన్నాయ్. ఇప్పుడు ప్రియాంకా పేరుతో వస్తున్న బజ్… సినిమా హంగామాను ఇంటర్నేషనల్ లెవెల్‌కి తీసుకెళ్తుందనడంలో సందేహం లేదు.
ఇప్పటికే ప్రియాంకా రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న పాన్-ఇండియా చిత్రంలో సైన్ చేసింది. “వారణాసి” పేరిట హైదరాబాద్‌లో గ్రాండ్ లాంచ్ జరిగింది. ఈ ప్రాజెక్ట్‌కు ఆమె 30 కోట్లకుపైగా ఫీజు తీసుకుంటోందన్న వార్తలు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి
అయితే… కల్కి సీక్వెల్‌కి వస్తే ఎంత తీసుకుంటుంది?
30 కోట్లు కంటే ఎక్కువా? లేక రికార్డ్ బ్రేక్ రేంజ్‌లోనా?
అదే ఇప్పుడు టాప్ డిస్కషన్!
కల్కి 2లో ప్రియాంకా స్టెప్ ఇస్తే… అది గేమ్ చెంజర్ అవుతుందనడంలో ఎవరికీ డౌట్ లేదు!
