వెంకటేశ్‌ (Venkatesh) హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బ్రద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లోనూ కలెక్షన్స్ వైజ్ ఈ సినిమానే టాప్ లో నిలిచింది. ఇంత హిట్ టాక్ వచ్చాక ప్రమోషన్స్ జోరు తగ్గిస్తారు కానీ అనీల్ రావిపూడి తీరే వేరు. మరింత స్పీడు పెంచేసారు. ఈ సినిమా ఎట్టిపరిస్దితుల్లోనూ థియేటర్స్ లో చూడాల్సిందే అన్నట్లు ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.

ప్రీ రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ తో అదరకొట్టిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా, రిలీజ్ అయిన తర్వాత కూడా అదే ఊపును కొనసాగిస్తూ ముందుకు వెళ్తోంది.

క్లీన్ కమర్షియల్ సక్సెస్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న మూవీకి మళ్ళీ లేటెస్ట్ ప్రమోషన్స్ తో మూవీ టీమ్ ముందుకొచ్చింది.

రీసెంట్ గా యాంకర్ సుమ ఇంటికి వెళ్లి మరీ టీమ్ ఆమెను ఇంటర్వ్యూని సెట్ చేసి వీక్షకులను ఆకట్టుకున్నారు. ఫన్నీగా సాగిన ఈ ఇంటర్వ్యూ సంగతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

హీరో విక్టరీ వెంకటేష్, హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు, మూవీ అసలు హీరోగా మారిన బుడ్డోడు బుల్లి రాజు పాల్గొన్న ప్రమోషన్స్ కూడా ప్రేక్షకులలోకి బాగా వెళ్ళింది.

సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందని అక్కడితో వదిలేయకుండా చిత్ర యూనిట్ ఇంకా ప్రమోషన్స్ చేస్తుండడం గొప్ప విషయం.

‘సంక్రాంతికి వస్తున్నాం’చిత్రం ఏదో సీరియస్ టోన్ తో సాగే కథో లేక న్యూ ఏజ్ స్టోరీనో కాదు అన్న విషయం టీం రిలీజ్ కు ముందే ట్రైలర్స్ తో ఆడియన్స్ కి చెప్పేశారు. దాంతో కథ పరంగా మరీ అద్బుతాలు ఎవ్వరూ ఊహించలేరు.

సినిమాలో కూడా స్టోరీ పాయింట్ పెద్దగా ఏమి లేదు. కానీ అనిల్ రావిపూడి మార్క్ కామెడీ సీన్స్ తో స్టార్ట్ టు ఫినిష్ చాలా చోట్ల కామెడీ ఎక్స్ లెంట్ గా వర్కౌట్ అవ్వడంతో కలిసి వచ్చింది.

ఎక్కడా పెద్దగా బోర్ ఏమి ఫీల్ అవ్వకుండా సినిమా మంచి టైం పాస్ ఎంటర్ టైనర్ గా లాగటం చాలా మందికి నచ్చుతోంది.

, ,
You may also like
Latest Posts from