
కరూర్ తర్వాత సైలెన్స్ బ్రేక్ చేసిన దళపతి! – పుదుచ్చేరి సభలో సూటిగా ఫైర్!
కరూర్ విషాదం తర్వాత రెండు నెలలు మౌనం పాటించిన తళపతి విజయ్, ఈరోజు మళ్లీ ప్రజల్లోకి వచ్చాడు. 41 మంది ప్రాణాలు తీసిన ఆ భయంకర ఘటన తర్వాత తళపతి ఎప్పుడు మాట్లాడతాడు, ఏమంటాడు అనే ఆసక్తి అభిమానుల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ పీక్‌లో ఉంది.
మరి… ఈరోజు పుదుచ్చేరిలో జరిగిన భారీ సభలో విజయ్ ఫైర్ మోడ్లోకి వెళ్లాడు! మాటలు మాత్రమే కాదు, స్వరంలో కూడా రగిలే ఆవేశం కనిపించింది!
పుదుచ్చేరి నుంచి రాజకీయ బాంబులు!
విజయ్ మాట్లాడుతూ — “యూనియన్ గవర్నమెంట్‌కి తమిళనాడు, పుదుచ్చేరి వేర్వేరు ప్రాంతాలు కావచ్చు… కానీ మా కోసం ఇవి ఒకే నేల, ఒకే ప్రజలు!” అని చెప్పి భారీ చప్పట్లు అందుకున్నారు. దళపతి పుదుచ్చేరి ప్రభుత్వానికి పూర్తి భద్రత కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
అక్కడితో ఆగలేదు —
విజయ్ నేరుగా తమిళనాడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటుగా దూసుకెళ్లారు. “పుదుచ్చేరి నుంచి తమిళనాడు ప్రభుత్వం నేర్చుకోవాలి. పాలన అంటే ప్రజలను మోసం చేయడం కాదు, సేవ చేయడం.” అని బహిరంగంగా ఎండగట్టారు.
DMKపై డైరెక్ట్ దాడి – “వారి లక్ష్యం పాలన కాదు, మోసం!”
తళపతి విజయ్, TVK పార్టీ అధ్యక్షుడిగా, “తమిళనాడులో పాలన చేస్తున్న పార్టీకి ఒక్క లక్ష్యం ఉంది – ప్రజలను మోసం చేయడం, పాలన కాదు!” అని గర్జించాడు. తన మాటల్లో రాజకీయ ఆవేశం, ప్రజా వ్యథ, ఆత్మవిశ్వాసం అన్నీ మిళితమై ఉన్నాయి. చివరగా, పుదుచ్చేరికి “స్టేట్ హుడ్ ఇవ్వాలి” అని కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేశారు.
“పుదుచ్చేరి ప్రజల హక్కు కోసం నేను ఉన్నాను. ఇది కేవలం రాజకీయ అంశం కాదు – గౌరవానికి సంబంధించినది.”
అని దళపతి స్పష్టం చేశారు.
తళపతి నెక్ట్స్ మూవ్‌పై సస్పెన్స్ పెరిగింది!
కరూర్ ఘటన తర్వాత మౌనంగా ఉన్న తళపతి, ఇప్పుడు నిప్పులాంటి స్పీచ్ ఇచ్చాడు. ఇకనుంచి ఆయన TVK పార్టీ ఉద్యమం మరింత ఆగ్రహంగా సాగబోతోందన్న సంకేతం స్పష్టంగా కనిపించింది.
