సినిమా వార్తలు

అన్‌ఫాలో, డిలీట్… నివేతా లవ్ స్టోరీకి షాక్ ట్విస్ట్?

నివేతా పెతురాజ్ ఎంగేజ్‌మెంట్ పిక్స్ డిలీట్… ఏం జరుగుతోంది నిజానికి? ప్రస్తుత కాలంలో బ్రేకప్‌లు, ప్యాచ్‌అప్‌లు పెద్దగా ప్రకటనలు కావాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఒక్క క్లిక్ చేస్తే చాలు… ఎవరు ఎవరిని ఫాలో చేస్తారు, ఎవరు సైలెంట్‌గా అన్‌ఫాలో అయ్యారు, ఏ ఫోటో మాయమైందో నెటిజన్లు డిటెక్టివ్‌లా కనుక్కోడం ఇదో కొత్త ట్రెండ్.

ఇప్పుడు అదే సైలెంట్ డ్రామా టాలీవుడ్‌ బ్యూటీ నివేతా పెతురాజ్ దగ్గర కనిపిస్తోంది.

ఫోటోలు వచ్చాయి… వెంటనే మాయమయ్యాయి!

దాదాపు రెండు ఏళ్లుగా సినిమాల్లో కనిపించని నివేతా ఇటీవల ఒకేసారి ఎంగేజ్‌మెంట్ ఫోటోలతో వచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. దుబాయ్ బిజినెస్‌మ్యాన్ రాజిత్ ఇబ్రాన్ తో ఎంగేజ్‌మెంట్ ఫోటోస్ షేర్ చేసింది.

కొద్ది రోజులలోనే… అన్నీ పఫ్! మాయమయ్యాయి.

అన్‌ఫాలో, డిలీట్… ఏదో జరిగింది?

నివేతా ఇన్‌స్టాలో అతనిని అన్‌ఫాలో చేసిందట. ఎంగేజ్‌మెంట్ ఫోటోలు కూడా డిలీట్ అయ్యాయి. అదే క్రమంలో రాజిత్ కూడా ఆమెను అన్‌ఫాలో చేశాడని స్క్రీన్‌షాట్లు వైరల్.

ఇప్పుడు ఆమె పేజ్‌కి వెళ్తే… ఏమీ లేదు.
పిక్స్ లేదు.
ఫాలోయింగ్ లేదు.
“డిజిటల్ ప్రిస్టిన్!”

అతని పేజ్ కూడా అలాగే – నివేతా కనబడడం లేదు.

ఇది యాదృచ్ఛికం? లేదా ఏదో నిజంగానే జరిగిందా?

బ్రేకప్? లేక గ్లిచ్?

ఇటీవలే క్రికెటర్ స్మృతి మంధానా కూడా తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలు తొలగించి, కొద్ది రోజుల తర్వాత వెడ్డింగ్ కాల్ ఆఫ్ ని కన్ఫర్మ్ చేసింది.
కాబట్టి ఇప్పుడు నెటిజన్ల ప్రశ్న – “నివేతా కేస్ ఏ వైపుకు?”

గ్లిచ్?
బ్రేకప్?
లేక మరో ట్విస్ట్?

నివేతా ఏమీ మాట్లాడలేదు. ఫ్యాన్స్ మాత్రం ఊహాగానాలే చేస్తున్నారు:
తిరిగి సినిమాల్లోకి వస్తుందా?
పర్సనల్‌గా టైమ్ తీసుకుంటుందా?
లేక మరేదైనా స్టోరీ ఉందా?

ఎక్కడో ఏదో హింట్ వచ్చే వరకు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.

Similar Posts