ఆమీర్ ఖాన్, లోకేష్ కనగరాజ్ డైరక్షన్ అనగానే ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటాయి. ఒకవైపు బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆమీర్, మరోవైపు సౌత్‌లో పాన్-ఇండియా క్రేజ్‌ని సెట్ చేసిన డైరెక్టర్ లోకీ – ఈ కాంబోపై బజ్ సహజంగానే గట్టిగానే ఉంటుంది.

కానీ రజనీకాంత్ “కూలీ” తర్వాత ఈక్వేషన్స్ మారిపోయాయి. బాక్సాఫీస్ దగ్గర సినిమా రూ.500 కోట్ల మార్క్‌ దాటినా… లోకేష్ డైరెక్టర్ ఇమేజ్‌పై మాత్రం బలమైన షాక్ పడింది. రైటింగ్ వీక్‌గా ఉందని, రెండో హాఫ్ బోరింగ్‌గా ఉందని ఆడియన్స్ స్ట్రెయిట్‌గా చెప్పేశారు. “లోకీ స్పార్క్ తగ్గిందా?” అనే డౌట్స్ కూడా ఇండస్ట్రీలో మొదలయ్యాయి.

“కూలీ” రాక ముందు ఆమీర్ ఖాన్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో లోకేష్ చేస్తున్న ప్రాజెక్టులు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఆమీర్‌తో చేసే సినిమా పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. “కూలీ”లో ఆమీర్ చేసిన చిన్న కెమియో కూడా ఎక్సైట్మెంట్‌ని పెంచింది.

కానీ షాకింగ్ అప్‌డేట్ ఏంటంటే-లోకేష్-ఆమీర్ సినిమా పూర్తిగా ఆగిపోయిందట!

అంతే కాదు, కార్తి హీరోగా ఉండే “ఖైది 2” కూడా ఇప్పుడు ఇన్డెఫినిట్‌గా పోస్ట్‌పోన్ అయింది.

అయితే గేమ్ ముగిసిపోలేదు. లోకేష్ ఇప్పుడు ఇంకా బిగ్గెస్ట్ డ్రీమ్ వైపు అడుగేస్తున్నాడు—ఒకే ఫ్రేమ్‌లో రజనీకాంత్-కమల్ హాసన్‌లను రీయూనైట్ చేసే మాసివ్ ప్రాజెక్ట్! ఈ కాంబినేషన్‌పై ఆడియన్స్ ఆసక్తి చూపిస్తే, మేము సిద్ధమని కమల్ హాసన్ కూడా ఇటీవల క్లారిటీ ఇచ్చేశారు.

, , , , , ,
You may also like
Latest Posts from