ప్రముఖ తమిళ నటుడు విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న తాజా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపుతోంది. ప్రవీణ్ కె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

తెలుగు ట్రైలర్‌ను ఆదివారం దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియాలో విడుదల చేయగా, అది క్షణాల్లో వైరల్ అయింది. ట్రైలర్‌లో కనిపించిన డార్క్ టోన్, ఫ్రాంటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వేగంగా కదిలే న్యారేషన్ థ్రిల్లర్ లవర్స్‌కి పచ్చి గూస్‌బంప్స్ ఇచ్చాయి.

హత్యల వరుస నేపథ్యంలో నడిచే ఈ కథలో, విష్ణు విశాల్ ఒక కట్టుదిట్టమైన పోలీస్ అధికారిగా కనిపిస్తున్నారు — సైకో కిల్లర్‌ని వెంబడించే రోలర్ కోస్టర్ రైడ్‌లో ఆయన ఆన్‌స్క్రీన్ ఇంటెన్సిటీ మరోసారి గుర్తు తెస్తుంది ‘రాక్షసన్’ రోజులను.

సినిమాలో సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఘిబ్రాన్ అందించిన మ్యూజిక్, ప్రత్యేకంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ట్రైలర్ మొత్తానికి నరాలు తెగేలా టెన్షన్‌ను నింపింది.

ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఆర్యన్ థియేటర్లలో అక్టోబర్ 31న — ఈ హాలోవీన్‌కి నిజమైన భయం వస్తోంది!

, , , , ,
You may also like
Latest Posts from