తమిళంలో స్టార్ హీరో అజిత్ కి ఓ రేంజిలో ఫ్యాన్ బేసే ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా విదాముయార్చి తో ప్రేక్షుకుల ముందుకొచ్చిన అజిత్.. ఇప్పుడు, గుడ్ బ్యాడ్ అగ్లీ అనే కొత్త కాన్సెప్ట్ తో మరోసారి సందడి చేయనున్నారు. ప్రస్తుతం, ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి.
🥺🥺🥺🥺🥺💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔#AjithKumar #GoodBadUgly https://t.co/O6l3HsQ62B pic.twitter.com/g1CUwIbevP
— AJITHKUMAR ARMY™ (@AjithKumarArmy) April 6, 2025
ఈ నేపధ్యంలో మూవీని సినిమా ప్రమోషన్స్ జోరు పెంచింది టీమ్. అందులో భాగంగా రీసెంట్ గా ట్రైలర్ వదిలింది. ఇప్పుడు నెల్లైలోని బిఎస్ఎస్ సినిమా అజిత్ కొత్త చిత్రం కోసం ఏకంగా 285 అడుగుల ఎత్తైన భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. అయితే,ఎక్కడ పొరపాటు జరిగిందో కాని ఊహించని విధంగా ఒక్కసారిగా కటౌట్ కుప్పకూలింది. ఆ సమయానికి దగ్గర్లో ఎవరూ లేరు కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో వస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ ఏప్రిల్ 10వ తేదీన విడుదల కానుంది. హీరోయిన్ త్రిష, అర్జున్ దాస్, ప్రసన్న ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కు అందించారు.