
ట్రేడ్‌కి షాక్ ఇస్తున్న ‘అఖండ 2’ ప్రీ-బిజినెస్ ఫిగర్ !
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ – మాస్ మాస్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్‌లోనే కాదు, పాన్–ఇండియా మార్కెట్‌లో కూడా మాస్ ఆడియెన్స్‌కు హై వోల్టేజ్ గ్యారెంటీ. సీక్వెల్ అనౌన్స్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకూ ‘అఖండ 2 : తాండవం’ మీదున్న క్రేజ్ రోజు రోజుకీ రెట్టింపు అవుతోంది. ఏ అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ఆగకుండా ట్రెండ్ అవుతూనే ఉంది.
దానికి తోడు ఈసారి సినిమా దైవిక యాక్షన్ + సనాతన ధర్మం థీమ్‌తో రావడంతో, ప్రస్తుతం దేశవ్యాప్తంగా డివోషనల్ మూవీస్ హవా నడుస్తున్న ఈ సమయంలో ‘అఖండ 2’ పాన్–ఇండియా ఆడియెన్స్‌కి సరిగ్గా సరిపోయేలా మారింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలై సునామీలా మారింది.
థియేట్రికల్ + నాన్-థియేట్రికల్ రైట్స్ కలిపి 250 కోట్లకు పైగా బిజినెస్ క్లోజ్! ఇది బాలకృష్ణ కెరీర్‌లో, బోయపాటి శ్రీను కెరీర్‌లో ఎప్పుడూ లేని ఆల్ టైమ్ హయ్యెస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్!
ఇంత పెద్ద స్కేల్‌లో బిజినెస్ జరగడం అంటే ఇప్పుడు మార్కెట్‌లో బాలయ్య–బోయపాటి కాంబినేషన్ పవర్ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పినట్టే.
ప్రమోషన్స్, ట్రైలర్, పాటలకి దేశవ్యాప్తంగా భారీ స్పందన!
ట్రైలర్‌కు మల్టీ-లాంగ్వేజ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్, మొదటి రెండు పాటలకు సోషల్ మీడియాలో అఖండ వ్యాప్తి, పాన్–ఇండియా ప్రమోషన్స్ ముంబై, వారణాసి వంటి హాట్ స్పాట్స్‌లో, ఈ మొత్తం బజ్ కారణంగా సినిమా ఓపెనింగ్స్ సెన్సేషనల్ రేంజ్‌లో ఉంటాయని ట్రేడ్ సర్కిల్స్ ధీమాగా చెబుతున్నాయి.
భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ – ఈ రోజు హైదరాబాద్‌లో!
14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం బాలయ్య స్వయంగా పాన్–ఇండియా ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో జరగబోతున్న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో హైప్ మరింత పెరగనుంది.
