పుష్ప సినిమాతో బాలీవుడ్‌లో కూడా క్రేజ్ తెచ్చుకున్నారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో బాలీవుడ్ సినిమా చేయనున్నారన్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఆ సినిమాలో ఆమీర్ ఖాన్ కూడా నటించనున్నాడు, గీతా ఆర్ట్స్ భారీగా ఈ కాంబినేషన్‌లో సినిమా నిర్మించబోతుంది అంటూ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
అయితే ఈ వార్తలపై స్వయంగా ఆమీర్ ఖాన్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
“అల్లు అరవింద్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. గజిని సినిమా సమయంలో అల్లు అర్జున్‌ని దగ్గరగా చూసా. మా మధ్య మంచి స్నేహం ఉంది. కానీ, అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నాం అన్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఆ ఆలోచన ఎవరూ నా వద్దకు తీసుకురాలేదు. నేను కూడా అలాంటి ప్లాన్ ఏదీ చేసుకోలేదు. ఫోటో ఒకటి చూసిన తరువాతే ఆ వార్తలు పుట్టొంచారనిపిస్తోంది” అంటూ చెప్పారు.
ఇకపై అలాంటి ప్రాజెక్ట్ వస్తుందో లేదో చెప్పలేనప్పటికీ, ప్రస్తుతం మాత్రం అలాంటి సినిమా ప్లాన్‌లో లేదు అని ఆమీర్ ఖాన్ ఖచ్చితంగా స్పష్టం చేశారు.
ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే… ఆయన అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. అందులో దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతోనే బాలీవుడ్‌లో పట్టు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగులో డబ్ సినిమాలే బాలీవుడ్‌లో హిట్ అవుతున్న తరుణంలో, డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ అవసరమేంటనే చర్చలు కూడా నడుస్తున్నాయి. అయినా, భవిష్యత్తులో అల్లు అర్జున్ ఏదైనా బాలీవుడ్ సినిమా చేస్తే, ఆమీర్‌తో కాంబినేషన్ అసలు మిస్ కాదు అనే అభిప్రాయమే అభిమానుల్లో.